• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ ట్రైలర్‌

    దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2009లో విడుదలైన వెండితెర అద్భుతం అప్పట్లో సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ‘అవతార్‌’ సీక్వెల్‌కు సంబంధించిిన ట్రైలర్ విడుదలైంది. ఇటీవల అవతార్‌ రీ రిలీజ్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేలా ఉంది.

    చైనాలో వైరల్‌ అవుతున్న హిందీ పాట

    చైనాలో కరోనా కారణంగా ఆంక్షల పర్వం కొనసాగుతున్న వేళ..అక్కడ ఓ బాలివుడ్‌ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. 1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్‌’ సినిమాలోని ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ అక్కడి సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ప్రముఖ సింగర్, మ్యూజిక్‌ డైరక్టర్‌ బప్పీ లహరీ అప్పట్లో దీనికి సంగీతం అందించారు. మాండరిన్‌ భాషలో ‘జియ్‌ మీ, జియ్‌ మీ’ అంటే అర్థం ‘గివ్‌ మీ రైస్‌’ అని. అందుకే లాక్‌డౌన్‌పై సెటైరికల్‌ జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. … Read more

    ఇలా చేశావేంటి కేన్‌ మామా!

    క్రీడాస్ఫూర్తికి న్యూజిలాండ్‌ జట్టు మారుపేరు, అలాంటిది ఇవాళ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో శాంటర్న్‌ వేసిన బంతిని బట్లర్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. కేన్‌ విలియమ్సన్‌ ఓ చక్కటి డైవ్‌తో క్యాచ్‌ పట్టాడు. అంతా వావ్‌ అనుకున్నారు. బట్లర్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ రీప్లేలో చూస్తే బంతి కేన్‌ విలియమ్సన్‌ చేతుల్లోంచి జారి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో ఏంటి కేన్‌ మామా చెప్పాలి కదా! అంటూ నెటిజన్లు … Read more

    మునుగోడులో TRS,BJP రాళ్లదాడి

    మునుగోడులో పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారానికి చివరి రోజైన నేడు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లిన ఈటల కాన్వాయ్‌పైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తన గన్‌మెన్లు, కార్యకర్తలు గాయపడ్డారని, 10-15 కార్లు ధ్వంసం చేశారని అయినా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఈటల ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.

    IMA కార్యక్రమంలో డాక్టర్ల ఫైటింగ్‌

    జబాల్‌పూర్‌లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఘర్షణ తలెత్తింది. వైద్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జబాల్‌పూర్‌ IMA నూతన అధ్యక్షుడు అభిజిత్ బిష్ణోయి చెప్పిన వివరాల ప్రకారం మాజీ IMA అధ్యక్షుడు, మరికొంత మంది వైద్యుల నడుమ వివాదం తెల్తితనట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో స్వాగతోపన్యాసం ఈ ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ये क्या दवा लिखने वाले हाथ मारपीट पर उतरे.. जबलपुर में #IMA के कार्यक्रम में डाक्टर आपस … Read more

    గుజరాత్ బ్రిడ్జి కూలిన CCTV దృశ్యాలు

    గుజరాత్‌లో 140 మందికి పైగా మృతికి కారణమైన బ్రిడ్జి కూలిన విషాదానికి సంబంధించి [సీసీటీవీ వీడియో](url) బయటకి వచ్చింది. ఇటీవలే వంతెనను ప్రారంభించగా…. ఆదివారం జరిగిన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వంతెనపై కనీసం 500 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే 140 మందికి పైగా చనిపోయినట్లు నిర్ధరించారు. వంతెన కూలుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. CCTV footage of #MorbiBridge pic.twitter.com/yYnwtHdBqu — Bhavesh Lodha (@bhav2406) October 31, 2022

    జట్లు పట్టుకుని మహిళా లాయర్ల ఫైటింగ్‌

    ఇద్దరు మహిళా లాయర్లు జుట్టుపట్టుకుని కొట్లాడుకున్న [వీడియో](url) నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరూ తీవ్ర కోపంతో ఒకరిపై దాడి చేసుకున్నారు. కింద పడినా వినకుండా ఫైట్‌ చేశారు. అక్కడున్న మిగతా లాయర్లు ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. వీరి మధ్య గొడవ ఎందుకు తలెత్తిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. महिला वकीलों में जमकर मारपीट, एक-दूसरे के खींचे बाल, जमकर बरसाए थप्पड़। वीडियो हुआ वायरल… यूपी के कासगंज से सामने … Read more

    టేకాఫ్‌ అవుతుండగా విమానానికి మంటలు

    బెంగళూరులో ఓ ఇండిగో విమానంలో టేకాఫ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. విమానం టేకాఫ్ అయ్యే కొద్ది క్షణాల ముందు భారీ శబ్దం వినిపించదని, ఆ తర్వాత ఓ ఇంజిన్‌ ఫెయిలైనట్లు గుర్తించామని చెబుతున్నారు. మంటలు అంటుకున్నట్లు గుర్తించి వెంటనే విమానాన్ని ఆపివేశారు. దీనిపై DGCA సమగ్ర దర్యాప్తు చేయనుంది. Just saw : – IndiGo plane VT-IFM caught fire while it was taking off yesterday – … Read more

    “హాయ్ విజయ్‌ మామా” రిషి సునాక్‌ వీడియో వైరల్‌

    “హాయ్‌ విజయ్‌ మామా! ఎలా ఉన్నావ్‌?” అంటూ భారత సంతతికి చెందిన నూతన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ షెఫ్‌ సంజయ్‌ రైనా ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంతకీ విజయ్‌ మామా ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘విజయ్‌ మాల్యా’ అయితే కాదుగా అంటూ కొందరు కామెడీ ట్వీట్లు చేస్తున్నారు. ఆ [వీడియో](url) మీరు కూడా చూడండి. Visa on arrival ab pakka ??#RishiSunak pic.twitter.com/imSIhuEgKB … Read more

    MLAల వ్యవహారంలో ఆడియో

    నలుగురు TRS ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆడియో బయటికొచ్చింది. ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రోడ్డి నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో మాట్లాడుతున్న ఆడియో లీకయింది. దీనిపై ఇవాళ సీఎం కూడా మాట్లాడే అవకాశముంది.