• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళలపై పోలీసుల లాఠీ చార్జ్‌

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌లో మహిళలపై పోలీసులు లాఠీదెబ్బలు కురిపించారు. అంబేద్కర్‌ విగ్రహానికి సంబంధించిన ఓ నిరసనలో ఈ ఘటన జరిగింది. లాఠీలతో పోలీసులు మహిళలపై ఇష్టారీతిన దాడి చేశారు. దీనికి సంబంధించిన [వీడియో](url)లు నెట్టింట వైరల్‌గా మారాయి. #Video | UP Cops Rain Blows On Women, Police Say They Threw Stones pic.twitter.com/UKI7ybGy9m — NDTV (@ndtv) November 7, 2022

    నాకు 4 బుల్లెట్లు తగిలాయి: ఇమ్రాన్‌ ఖాన్‌

    పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జరిగిన కాల్పులపై ఆయన తొలిసారి స్పందించారు. కాలుకు పట్టీ కట్టుకుని ఆయన మాట్లాడారు. తనకు నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన చెప్పారు. వజీరాబాద్‌లో లేదంటే గుజ్రాత్‌లో తనను చంపాలని చూస్తున్నారని తనకు ముందు రోజే తెలుసని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ప్రభుత్వమే తనను చంపేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ కాల్పుల ఘటనలో ఇప్పటికి ఒకరు మృతి చెందగా…13 మందికి గాయాలయ్యాయి.

    ‘కాంతార’ రిషభ్‌ శెట్టితో ఏబీ డివిల్లీర్స్‌

    ప్రాంతీయ సినిమాగా మొదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే వినిపిస్తోంది. తాజాగా ఐపీఎల్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కాంతారతో జతకట్టింది. ఏబీ డివిల్లీర్స్‌తో కలిసి రిషభ్‌ శెట్టి ‘కాంతార’ అంటూ చేసిన ఓ [వీడియో](url)ను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. It’s a match.The real 360s today of the film industry and Cricket.#Kantara @shetty_rishab @ABdeVilliers17 @RCBTweets @hombalefilms @VKiragandur @gowda_sapthami @HombaleGroup @ChaluveG @Karthik1423 … Read more

    శివసేన నాయకుడు సిధ్దు సూరి హత్య

    పంజాబ్‌లో శివసేన నాయకుడు సిధ్దు సూరిపై పోలీసులు చూస్తుండగానే కాల్పులు([వీడియో](url)) జరిగాయి. అమృత్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. సిద్ధూ మూసేవాలా తర్వాత పంజాబ్‌లో ఇదే మరో పెద్ద కాల్పుల ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల భద్రత ఉండగానే నిందితుడు కాల్పులు జరిపాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సిద్ధూ సూరి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసుల్లో జైలు జీవితం కూడా గడిపారు. Punjab #Live : Shiv Sena … Read more

    దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు

    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ‘హారే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని అసభ్యంగా చిత్రీకరించాలని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి. ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌లో ఈ పాట విడుదలైంది.

    ‘వారిసు’ సాంగ్‌ ప్రోమోపై ట్రోల్స్‌

    విజయ్‌ దళపతి, రష్మిక మంధాన లీడ్‌ రోల్స్‌లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి పాటకు సంబంధించిన ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. దీనికి థమన్‌ సంగీతం అందించగా, జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ప్రోమో విడుదలైన తర్వాతి నిమిషం నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. అదే మ్యూజిక్, అవే స్టెప్పులు ఎన్నిసార్లు భయ్యా అంటూ థమన్, జానీ మాస్టర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

    సీఎం కేసీఆర్‌ లైవ్‌

    ముఖ్యమంత్రి కేసీఆర్‌ లైవ్‌లో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తదితర అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలను న్యాయ వ్యవస్థ ముందుంచుతామన్నారు.

    106 మీటర్ల సిక్స్‌ బాదిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌

    పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఇవాళ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. 16వ ఓవర్లో లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఏకంగా 106 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. ఈ వరల్డ్‌ కప్ సూపర్‌ 12 స్టేజ్‌లో ఇదే అత్యంత భారీ సిక్స్‌. డేవిడ్‌ మిల్లర్‌ ఇండియాపై కొట్టిన 104 మీటర్ల సిక్స్ రెండో స్థానంలో ఉంది. ఫించ్‌ (102 మీటర్లు), మిచెల్‌ మార్ష్‌(102 మీటర్లు), స్టాయినిస్‌ (101 మీటర్లు) ఉన్నారు. అయితే క్వాలిఫయర్లతో కలిపి చూసుకుంటే యూఏఈ బ్యాటర్‌ జునైద్‌ … Read more

    వెక్కి వెక్కి ఏడ్చిన బంగ్లా ఫ్యాన్స్‌

    ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం అనంతరం బంగ్లా అభిమానులు, క్రీడాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ కోల్పోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఓ చిన్న పాప ఏడుస్తున్న[ వీడియో](url) నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కొందరు అంపైర్ల నిర్ణయాలపై ఓటమిని తోసేస్తున్నారు. టీమిండియా అంపైర్లను కొనేసిందంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. Sorry gentlewoman, We know it hurts but this is what sports is about. Stay strong !#INDvsBAN#JaiHind pic.twitter.com/nhhmKw9Tcn — Saurav … Read more

    దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు

    టాలివుడ్‌ స్టార్‌ మ్యూజిషియన్‌ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి DSP హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.