Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!  
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!  

    Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!  

    September 18, 2024

    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్‌ మెుదలైంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలివుడ్‌ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్‌ఫుల్‌ క్యామియో లేదా రోల్‌ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. తద్వారా సూపర్‌ హిట్‌ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్‌ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్‌ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. 

    చిరు క్యామియో

    చిరంజీవి హీరోగా నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు‘ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్‌ రీమేక్‌ చేశారు. ‘మాపిళ్లై’ పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్‌ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, ‘మీ అత్త బాగుందిరా!’ (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని ‘కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!’ అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం. 

    అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు

    మిస్టర్ బచ్చన్‌

    రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్‌ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్‌ వేసేలా చేసింది.

     

    కల్కి 2898 ఏడీ

    ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్‌ అదిరిపోయే క్యామియోస్‌ ఇచ్చారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలు పోషించారు. 

    సలార్‌

    ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించాడు. 

    జైలర్‌

    రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. 

    విక్రమ్‌

    కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్‌’ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్‌బంప్స్‌ తెప్పించారు. 

    బ్రహ్మాస్త్ర

    రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్‌ క్యామియో ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపించి అదరగొట్టాడు.

    వాల్తేరు వీరయ్య

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్‌ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 

    ఆచార్య

    మెగాస్టార్‌ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్‌ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్‌ చేసిన ’మగధీర’, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. 

    లాల్‌ సింగ్‌ చద్దా

    బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్ సింగ్‌ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

    లైగర్‌ 

    విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్‌’ చిత్రంలో వరల్డ్‌ ఫేమస్‌ బాక్సర్‌ ‘మైక్‌ టైసన్‌’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version