కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్-10 తెలుగు మెలోడీ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం…
1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం)
అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి.
2. కళావతి (సర్కారు వారి పాట)
మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.
3. గుండెల్లోనా (ఓరి దేవుడా)
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
4. కుంకుమల (బ్రహ్మస్త్ర)
బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్ శ్రీరామ్ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
5. మెహబూబా (కేజీఎఫ్ 2)
కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్ మ్యూజిక్ లవర్స్ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది
6. మాస్టారు మాస్టారు (సార్)
సార్(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్ సాంగ్‌గా ఉంది. సింగర్ శ్వేతా మోహన్ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.
7. నగుమోము తారలే (రాధేశ్యామ్)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్ లవర్స్ ఈ పాటను రిపీట్ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.
8. ఏడు రంగుల వాన (18 పేజెస్)
నిఖిల్(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్ (18 Pages) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి)
ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.
10. ప్రియతమ (కొత్త కొత్తగా)
కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్ అందించగా… శిద్ శ్రీరామ్ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం