• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన

    విజయనగరం-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ను మూడేళ్లలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు వేసినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తుకు వచ్చేవని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారబోతోందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఏపీకి కేంద్ర బింధువుగా మారబోతోందని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా సెప్టెంబర్‌ నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ?Welcome to Visakhapatnam International Airport by GMR Group #VizagInternationalAirport#Vizag#VizagInfra#AndhraPradesh#AndhraAirports#GMRAirport#Bhogapuram#BhogapuramAirport#YSJagan#Modi#CBN#PawanKalyan#Hyderabad #Vizianagaram pic.twitter.com/9b9Pfvpm4t — Andhra Updates (@UpdatesofAP) May 2, 2023

    కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

    [VIDEO:](url) కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఎక్కువై తీర్చలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. “ అమ్మ, నాన్న, చెల్లి నన్ను క్షమించండి. కొరియోగ్రాఫర్లు..మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాను. అప్పులు ఎక్కువయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అంటూ చెప్పాడు. నెల్లూరులో ఓ కార్యక్రమం కోసం వెళ్లి లాడ్జిలో దిగిన చైతన్య… ఉరేసుకొని చనిపోయాడు. సమాచారం తెలుసుకొని పోలీసులు వెళ్లినా అప్పటికే మృతిచెందాడు. చైతన్య ఢీ షో కూడ చేశాడు. Choreographer chaitanya Suicide in Nellore#ChoreographerChaitanya #RIP … Read more

    మా మ్యాడ్‌నెస్‌ మారదు: సుడిగాలి సుధీర్

    జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ ట్వీట్టర్‌ ఓ కూల్ పిక్‌ను షేర్ చేశాడు. పిక్‌లో డైరెక్టర్ వేణు ఎల్దండితో పాటు గెటప్ శ్రీను కూడా ఉన్నారు. మా మ్యాడ్‌నెస్ ఎప్పటికీ మారదు అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. వీరు ముగ్గురు కలిసి మంచులో కేరింతలు కొడుతున్న ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జబర్దస్‌ షోకు సుడిగాలి సుధీర్‌ను గెటప్ శ్రీనును.. వేణు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. The madness that never changed @getupsrinu3 @VenuYeldandi9 pic.twitter.com/fEJv4xip3f — Sudigali … Read more

    జబర్దస్త్ చలాకీ చంటికి గుండె పోటు!

    జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కొన్నేళ్లు జబర్దస్త్ షోలో అలరించిన చంటి ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్‌ 6లో కనిపించారు ఆ షో తర్వాత చంటి పెద్దగా షోలు చేయడం….లేదు. చంటికి ఈ నెల 21న తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటు వచ్చినట్లు … Read more

    పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల

    YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇంటి నుంచి తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో SIపై చేయి చేసుకున్నారు. వ్యక్తిగత పనులకు కూడా తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎందుకు వెళ్లనివ్వడం లేదో కారణం చెప్పాలని రోడ్డుపై బైటాయించారు. పోలీసులు తిరిగి ఆమెను ఇంట్లోకి పంపించారు. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిలపై బంజారహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 350కింద కేసు నమోదు చేశారు.

    నిర్మాత గూబ పలిగేలా సమంత కౌంటర్

    నిర్మాత చిట్టిబాబుకు హీరోయిన్ సమంత గట్టి కౌంటర్ ఇచ్చింది. సినిమాల విడుదలకు ముందు సమంత కావాలనే ఏడుస్తూ డ్రామాలు ఆడుతుందని చిట్టిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆమె హీరోయిన్ స్టేజీలో కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై సమంత తనదైన శైలీలో స్పందించింది. చెవిలో వెంట్రుకలు పెరగడానికి కారణం తెలుసా? అని గూగుల్‌ చేసి ఆన్సర్‌ను ఇన్‌స్టా స్టోరీలలో పెట్టింది. టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుదల వల్లే వెంట్రుకలు పెరుగతాయని సమాధానం ఉంది. నిర్మాత చిట్టిబాబుకు చెవిలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో … Read more

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేనే కొంటా: కేఏ పాల్

    అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తానే కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రభుత్వం అమ్ముతానంటే.. ఐదు రెట్లు ఎక్కువ ఇస్తానని ప్రకటించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని.. ఎంత నష్టాలు ఉంటే అంతా తాను చెల్లిస్తానని పేర్కొన్నారు. అమెరికా నిధులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను చేజిక్కించుకుంటానని చెప్పారు. ఆరు నెలల్లోగా మొత్తం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానన్నారు. ఎలన్ మస్క్, బెజోస్ లాంటి వారు ప్లాంట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేనే కొంటా. అమ్ముతానంటే అడిగిన … Read more

    షోరూంలో అగ్ని ప్రమాదం..122 బైకులు దగ్ధం

    [వీడియో:](url) ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని ఓ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 122 బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ షోరూం హార్డ్‌వేర్ దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 122 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. #fireaccident #AndhraPradeshThere was a huge fire in … Read more

    తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి; పవన్

    [వీడియో: ](url)తెలంగాణ ప్రజలకు వైఎస్సార్‌సీపీ క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడటం దారుణమన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. ఏపీలోని అధికార పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతల వైఖరి తనకు బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM — JanaSena Party (@JanaSenaParty) April 16, 2023

    ఉమ్మితే కారు మీద పడిందని వైకాపా కార్యకర్త హల్‌చల్‌

    [VIDEO:](url) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వైఎస్సార్సీపీ కార్యకర్త హల్‌చల్‌ చేశాడు. ద్విచక్ర వాహనంపై రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఉమ్మితే తన కారు మీద పడిందని అతడితో గొడవకు దిగాడు. వాహనదారుడిపై దాడి చేశాడు. అతడిని బెల్టుతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజురోజుకి వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ తెదేపా ఆరోపిస్తోంది. విజయవాడ – బైక్ పై రోడ్డు మీద వెళుతూ ఉమ్మితే తన కారు మీద పడిందని బెల్టుతో కొట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్త pic.twitter.com/ncY5Pi5g4j — … Read more