• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకేశ్ కాళ్లకు బొబ్బలు; భోరున ఏడ్చిన టీడీపీ నేత

    [వీడియో:](url) టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేశ్ అరి కాలికి ఏర్పడిన బొబ్బలను తలుచుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. లోకేశ్ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను చూసినట్లుగా ఇప్పుడు లోకేశ్‌ను చూడటానికి జనం వస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు… … Read more

    రేపే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

    [VIDEO](url): దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు ఆవిష్కరించనున్నారు. గద్దె, విగ్రహం కలిపి భూమి నుంచి 175 అడుగుల ఎత్తులో ఉందీ విగ్రహం. స్మారక భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్, మ్యూజియం ఉండనున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్‌ని ఆనుకుని 11.80 ఎకరాల్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పల్లెల్లోకి 750 బస్సులను పంపనున్నారు. 50వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల నడుమ ఆవిష్కార … Read more

    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 

    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా … Read more

    బండి సంజయ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

    TS: బండి సంజయ్‌పై పరోక్షంగా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోడి చేతిలో ఒకపార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ నాయకులు’ అంటూ కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. బండి సంజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, బండి సంజయ్ అరెస్టును సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే … Read more

    తిరుపతికి వందేభారత్.. టైమింగ్స్ ఇవే

    ఈ నెల 8న సికింద్రాబాద్‌- తిరుపతి(20701) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 6గంటలకు బయలు దేరి నల్గొండ(7:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) స్టేషన్ల మీదుగా ప్రయాణించి తిరుపతికి 2.30గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు(5:20), ఒంగోలు(6:30), గుంటూరు(7:45), నల్గొండ(10:10) స్టేషన్ల మీదుగా రైలు 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.  ఈ నెల 9వ తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) వందేభారత్‌ రైలు తిరుపతిలో మ. 3.15 గంటలకు బయలుదేరి.. నెల్లూరు (సా. 5.20), ఒంగోలు (సా. 6.30), … Read more

    తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

    దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.91.50 తగ్గించాయి. తాజా తగ్గింపుతో గ్యాస్ బండ ధర రూ.2,233కు పడిపోయింది. మరోవైపు గృహ అవసరాలకు వాడే 14కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 14కిలోల సిలిండర్ రేటు హైదరాబాద్‌లో రూ.1150గా ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ సంస్థలు రేట్లను సమీక్షిస్తుంటాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం తొలి రోజున చమురు సంస్థలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, … Read more

    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!

    తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో … Read more

    సరికొత్తగా హోండా యాక్టివా స్కూటీలు

    హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని  కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ … Read more

    HYD; ఆ రూట్‌లో 3 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు

    హైదరాబాద్‌లోని బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద దారి మళ్లిస్తారు. అలాగే కూకట్‌పల్లి నుంచి మూసాపేట్ వెళ్లే వాహనాలను గూడ్స్ షెడ్ మీదుగా మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి అమీర్‌పేట్ వచ్చే వాహనాలను న్యూబోయిన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు. … Read more

    టీటీడీ ఈఓపై గిద్దలూర్ ఎమ్మెల్యే ఫైర్

    [వీడియో](url); తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డిపై ప్రకాశం జిల్లా గిద్దలూర్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. సీఎంఓ కార్యాలయ సిఫారసులు ఉన్నా తమను దర్శనాలకు అనుమతించలేదని ధ్వజమెత్తారు. ఈఓ తన చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీని సొంత ఎస్టేట్‌లా భావిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డి వంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈఓపై సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డిలకు ఫిర్యాదు చేస్తానన్నారు. తిరుమలకు వచ్చే శాసనసభ్యులను అగౌరవ పరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈవో … Read more