• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుపతికి వందేభారత్.. టైమింగ్స్ ఇవే

    ఈ నెల 8న సికింద్రాబాద్‌- తిరుపతి(20701) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 6గంటలకు బయలు దేరి నల్గొండ(7:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) స్టేషన్ల మీదుగా ప్రయాణించి తిరుపతికి 2.30గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు(5:20), ఒంగోలు(6:30), గుంటూరు(7:45), నల్గొండ(10:10) స్టేషన్ల మీదుగా రైలు 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. 

    ఈ నెల 9వ తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) వందేభారత్‌ రైలు తిరుపతిలో మ. 3.15 గంటలకు బయలుదేరి.. నెల్లూరు (సా. 5.20), ఒంగోలు (సా. 6.30), గుంటూరు (రా.7.45), నల్గొండ (రా.10.10) మీదగా సికింద్రాబాద్‌కు రాత్రి 11.45 గంటలకు చేరుకోనుంది. 10వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో 6.00 గంటలకు బయలుదేరే రైలు (20701) నల్గొండ (ఉ. 7.19), గుంటూరు (ఉ. 9.45), ఒంగోలు (ఉ. 11.09), నెల్లూరు (మ.12.29) మీదగా తిరుపతికి మద్యాహ్నం 2.30 గంటలకు చేరుతుంది.

    Mysore Vande Bharat Express Trial run started from Chennai MG Ramachandran Central Railway station
    (ANI Photo)

    ఛార్జీల వివరాలు (Vande Bharat express ticket Charges)

    ఇక ఛార్జీల విషయానికొస్తే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య ఏసీ ఛైర్‌ కార్ టికెట్‌ ధర రూ. 1680, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ రూ. 3080లుగా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌ కార్‌ రూ. 1625, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్‌ రూ.3030లుగా పేర్కొన్నారు. ఈ రెండింటిలో స్వల్ప వ్యత్యాసం ఉంది. సికింద్రాబాద్‌ – తిరుపతి ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్ రూ. 1168 కాగా.. రిజర్వేషన్ ఛార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45, మెుత్తం జీఎస్టీ రూ. 63గా నిర్ణయించిందిం రైల్వే  శాఖ. రైళ్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు రూ. 364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేస్తున్నారు. అదే తిరుపతి – సికింద్రాబాద్ మధ్య బేస్ ఛార్జీని రూ. 1169గా…  కేటరింగ్ ఛార్జీని మాత్రం రూ. 308గా నిర్ణయించారు. 

    ఒక్కో స్టేషన్‌కు ఎంతంటే?

    సికింద్రాబాద్‌ నుంచి నల్గొండ – రూ. 450

    సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు – రూ. 865

    సికింద్రాబాద్‌ నుంచి ఒంగోలు – రూ. 1075

    సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ. 1270

    Screengrab Twitter:VandeBharatExp

    ఎగ్జిక్యూటివ్ ఛార్జీలు

    సికింద్రాబాద్‌ నుంచి నల్గొండ  – రూ. 900

    సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ. 1620

    సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ. 2045

    సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ. 2455

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv