• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    తిరుపతికి వందేభారత్.. టైమింగ్స్ ఇవే

    ఈ నెల 8న సికింద్రాబాద్‌- తిరుపతి(20701) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 6గంటలకు బయలు దేరి నల్గొండ(7:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) స్టేషన్ల మీదుగా ప్రయాణించి తిరుపతికి 2.30గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు(5:20), ఒంగోలు(6:30), గుంటూరు(7:45), నల్గొండ(10:10) స్టేషన్ల మీదుగా రైలు 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.  ఈ నెల 9వ తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) వందేభారత్‌ రైలు తిరుపతిలో మ. 3.15 గంటలకు బయలుదేరి.. నెల్లూరు (సా. 5.20), ఒంగోలు (సా. 6.30), … Read more

    సికింద్రాబాద్‌లో కొండచిలువ కలకలం

    సికింద్రాబాద్‌లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రైల్ నిలయం వెనుకనున్న రైల్వే కాలనీ పార్కులో ఈ 14 అడుగుల పైథాన్ కంటపడింది. పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగిస్తున్న క్రమంలో అక్కడ ఏవో కదలికలు కనిపించాయి. చెత్త తొలగించి చూడగా భారీ కొండచిలువ కనిపించడంతో వారు బిత్తరపోయారు. వెంటనే కార్మికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆ కొండచిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. A 14-feet long python located in the Rail Nilayam Colony … Read more

    ఈ ఏడాది స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి ఏం చెప్పిందంటే..

    సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళీ బోనాల ఉత్స‌వాలు నిన్న ఘ‌నంగా ప్రారంభ‌మయ్యాయి. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే రంగం కార్య‌క్ర‌మం నేడు నిర్వ‌హించారు. జోగిని స్వ‌ర్ణ‌ల‌త భ‌క్తుల‌కు భ‌విష్య‌వాణిని చెప్పింది. పూజ‌లు మొక్కుబ‌డిగా చేస్తున్నారు. మీ సంతోషం కోసం పూజ‌లు చేస్తున్నారు నాకోసం కాదు. అయిన‌ప్ప‌టికీ నా బిడ్డ‌లు సంతోషంగా ఉంటే చాల‌ని పూజ‌ల‌ను స్వీక‌రిస్తున్నా. నా ధ‌నాన్ని మొత్తం దోచుకుంటున్నారు. న‌న్ను మీ ఇష్టం వచ్చిన రూపాల్లో మారుస్తారా? నేను స్థిరంగా కొల‌వుదీరాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది. ఇంకా భ‌విష్య‌వాణి ఏం చెప్పిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.