• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!

    తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో … Read more

    సరికొత్తగా హోండా యాక్టివా స్కూటీలు

    హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని  కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ … Read more

    HYD; ఆ రూట్‌లో 3 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు

    హైదరాబాద్‌లోని బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద దారి మళ్లిస్తారు. అలాగే కూకట్‌పల్లి నుంచి మూసాపేట్ వెళ్లే వాహనాలను గూడ్స్ షెడ్ మీదుగా మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి అమీర్‌పేట్ వచ్చే వాహనాలను న్యూబోయిన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు. … Read more

    టీటీడీ ఈఓపై గిద్దలూర్ ఎమ్మెల్యే ఫైర్

    [వీడియో](url); తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డిపై ప్రకాశం జిల్లా గిద్దలూర్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. సీఎంఓ కార్యాలయ సిఫారసులు ఉన్నా తమను దర్శనాలకు అనుమతించలేదని ధ్వజమెత్తారు. ఈఓ తన చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీని సొంత ఎస్టేట్‌లా భావిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డి వంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈఓపై సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డిలకు ఫిర్యాదు చేస్తానన్నారు. తిరుమలకు వచ్చే శాసనసభ్యులను అగౌరవ పరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈవో … Read more

    IPL కామెంటేటర్‌గా బాలకృష్ణ

    [VIDEO:](url) నందమూరి నటసింహం బాలయ్య క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. ఈమేరకు ఐపీఎల్‌లో బాలకృష్ణ క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ తార స్థాయిలో ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా బాలయ్య ఇప్పటికే ఆహా ఓటీటీలో హోస్ట్‌గా వ్యవహరించి సెన్సెషన్ క్రియేట్ చేశారు. మరి కామెంటేటర్‌గా బాలయ్య ఎలా ఇరగదీస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్?ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్?నందమూరి బాలకృష్ణ గారు? తెలుగుజాతి గర్వపడేలా … Read more

    ప్రధాని మోదీపై కేసు వేస్తా: రేణుక చౌదరి

    [VIDEO:](url) ప్రధాని మోదీపై కేసు పెడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి తెలిపారు. పార్లమెంట్‌లో సూర్పణక అని అన్నారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నా. సూర్పణకది ఏ కులం.. ఓసీ అయితే కాదు కదా. నేను కూడా కర్ణాటకలో బీసీనే. దక్షిణ భారతదేశం అంటే మోదీకి చిన్న చూపు ఉంది అని విమర్శించారు. రాహుల్ గాంధీని ఎదుర్కోలేకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. త్వరలోనే ప్రజలు మోదీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. This classless megalonaniac referred to me as … Read more

    మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం

    మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా.. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌ పక్కకు ఒరిగింది. వెంటనే అధికారిక సిబ్బంది అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.

    హైదరాబాద్‌లో మరిన్ని ప్లైఓర్లు నిర్మిస్తాం: కేటీఆర్

    హైదరాబాద్‌లో మెట్రోలైన్‌ను భవిష్యత్తులో హయత్ నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే మెట్రో లైన్‌ను ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. SRDPలో భాగంగా రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్లైఓవర్లు నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

    GSLV మార్క్ 3 ప్రయోగం సక్సెస్

    [VIDEO:](url) ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. యూకేకు చెందిన ఉపగ్రహంతో పాటు మొత్తం 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ అన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ..సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు. … Read more

    ‘ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌కు శ్రీకాంతాచారి పేరు’

    హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా 760 మీటర్ల పొడవుతో.. 12 వెడల్పుతో రూ.32 కోట్లు వెచ్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. చింతల్‌కుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఈ వారధి నిర్మించారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఇకపై సిగ్నల్ ఫ్రీగా వెళ్లవచ్చు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లవచ్చు.