• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Priyanka Jawalkar: చీరకట్టులో దాగున్న వయ్యారాలతో కవ్విస్తున్న ప్రియాంక జవాల్కర్‌

    టాలీవుడ్‌లో అచ్చమైన తెలుగు అందం ప్రియాంక జవాల్కర్. సంప్రదాయబద్ధంగా ఉంటూనే తన హాట్ లుక్స్‌తో మెప్పిస్తూనే ఉంటుంది ఈ హీరోయిన్‌.  గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక పెట్టే పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంత అందమైన ఫొటోలు పెడుతుంది మరి.  ప్రస్తుతం చీరకట్టులో దాగున్న సొగసులతో కనువిందు చేస్తోంది ఈ అనంతపురం చిన్నది. నడుము వయ్యారాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.  కలవరమాయే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తర్వాత 2018లో టాక్సీ వాలా సినిమాలో విజయ్ దేవరకొండతో ఛాన్స్‌ కొట్టేసింది. … Read more

    మరో మూడు రోజులు వర్షాలు

    ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది. బుధ, గురు వారాల్లోనూ ఉరుములతో కూడిన వర్షం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత వారం రోజులుగా ఈ అకాల వర్షాలు రైతులను … Read more

    వైకాపాకు షాక్‌; మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు

    ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా, పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం తాజాగా వెల్లడైంది. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

    ఇది ప్రజావిజయం, మార్పునకు సంకేతం: చంద్రబాబు

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

    ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించట్లేదు: సజ్జల

    ఏపీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రెండు చోట్ల తెదేపా గెలవగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

    కూర్చుని పని చేస్తున్నారా.. జాగ్రత్త

    1950తో పోలిస్తే 2023లో రోజంతా కూర్చుని చేసే ఉద్యోగాల సంఖ్య 83శాతానికి పెరిగిందని హాప్కిన్స్ మెడిసిన్ సర్వే వెల్లడించింది. పని మధ్యలో బ్రేక్ తీసుకోకుండా చేయడం ఈ కాలంలో అధికమైందని తెలిపింది. దీంతో ఈ తరహా ఉద్యోగాలు చేసే వారికి ‘ది సిట్టింగ్ డిసీజ్’ వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి, మెడ నొప్పి, దీర్ఘకాలిక వ్యాధులు, బరువు పెరగడం, ఆందోళన, తదితర సమస్యల బారిన పడే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. క్రమంగా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యల … Read more

    11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

    ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాలు జరగకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని పలుమార్లు వారించినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్వీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం.

    వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం

    NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగా విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8మంది ఉన్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

    [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.