ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు కావాల్సిన వాళ్లపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియోను ఫేస్‌బుక్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అందులో విష్ణు ఎవరిపైకో దూకుడు వెళ్తుంటే ఇద్దరు అడ్డుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది?
మంచు మనోజ్ అనుచరుడు సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడని సమాచారం. ఆ సమయంలో మనోజ్ అక్కడే ఉండటంతో వీడియోను తీసినట్లు తెలుస్తోంది. “నా ఇష్టం” అంటూ విష్ణు గట్టిగా అరవటం చూస్తే ఇద్దరి మధ్య వాడీవేడీగానే పోరు జరుగుతుందని అర్థమవుతోంది. “ఇలా తనకు కావాల్సిన వాళ్ల ఇంటికి వచ్చి కొడుతున్నాడు. ఇది పరిస్థితి” అంటూ మనోజ్ మాట్లాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని వినికిడి.
గొడవలు వాస్తవమే!
మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట పడలేదు. విష్ణుతో గొడవల కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే పరిస్థితులన్ని కనిపించాయి. గత కొన్ని నెలలుగా వీరు మాట్లాడుకోవటం లేదు. మోహన్‌బాబు యూనివర్సిటీ స్నాతకోత్సవంలోనూ ఇద్దరూ పలకరించుకోకపోవటంతో గొడవలున్నాయని అందరూ భావించారు.
పెళ్లి ఇష్టంలేదు
భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం కూడా విష్ణుకి ఇష్టం లేదని సమాచారం. అందుకే వివాహ వేడుకకు సంబంధించి ఏ పనుల్లోనూ జోక్యం చేసుకోలేదు. మంచు లక్ష్మీ తన ఇంట్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసి అన్నింటిని దగ్గరుండి చూసుకుంది. విష్ణు పెళ్లికి ఏదో అతిథిలా వచ్చి పోయాడంతే. దీంతో వివాహ విషయంలోనూ విబేధాలు తలెత్తాయని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
రోడ్డుకెక్కాయి
ఇద్దరి మధ్య వివాదం చాలాకాలంగా ఉన్నప్పటికీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి వారిని నిలువరించారని తెలుస్తోంది. కానీ, ఇప్పుడు మనోజ్ వీడియో పెట్టడంతో మెుత్తం బట్టబయలు అయ్యింది.
క్రమ శిక్షణ
మోహన్ బాబు క్రమ శిక్షణకు మారుపేరు. చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఉన్న గుర్తింపు అది. కానీ, ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విబేధాలు రోడ్డున పడటంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ మెుదలయ్యాయి. ఇదేనా క్రమశిక్షణ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే, కుటుంబంలో గొడవలనేవి సాధారణమే కానీ.. సెలబ్రిటీల ఇంట్లో జరిగేతి అవి కాస్త చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుందనే వారు కూడా ఉన్నారు.
మోహన్ బాబు సీరియస్
మంచు విష్ణు, మనోజ్ వివాదంపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు. వెంటనే స్టేటస్‌ను డిలీట్ చేయాలని మంచు మనోజ్‌కు గట్టిగా చెప్పారు. దీంతో మనోజ్ తన ఫేస్‌బుక్ స్టేటస్‌ను డిలీట్ చేశారు. ఇంటి పరువు రచ్చకెక్కిస్తున్నారని ఇద్దర్ని ఫొన్‌లో మందలించినట్లు తెలిసింది. సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకోవాలని రోడ్డుకెక్కొద్దని తనదైన శైలీలో గట్టిగా హెచ్చరించారు.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!