• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మౌనిక కొడుకు బాధ్యతపై మనోజ్‌ స్పష్టత!

    సినీ నటుడు మంచు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి కాగా ఆమెకు అప్పటికే ఐదేళ్ల బాబు ధైరవ్‌ రెడ్డి ఉన్నాడు. దీనిపై సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి మనోజ్‌ చెక్‌ పెట్టే యత్నం చేశారు. సోమవారం శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన సందర్భంగా ‘కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తారంటారు.. బహూశా అది ఇదేనేమో’ అని మనోజ్‌ అన్నారు. దీన్ని బట్టి … Read more

    మంచు మనోజ్ పెళ్లి వీడియో చూశారా?

    తన ప్రియురాలు భూమా మౌనికారెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ఆరంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన [వీడియో](url)ను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మోహన్‌బాబు చేతుల మీదుగా తాళి అందించడం..దానిని మౌనిక మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి గురికావడం కనిపిస్తోంది. పెళ్లిలో మంచు లక్ష్మీ చేసిన హడావుడి స్పష్టంగా చూడవచ్చు. View this post on Instagram A post … Read more

    శ్రీవారి సేవలో మంచు మనోజ్ దంపతులు

    [వీడియో;](url) నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనికలు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మీప్రసన్న దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో మాత్రం ఓడిపోకూడదు. ప్రస్తుతం మా ప్రేమ గెలిచింది. త్వరలోనే నా సినిమా షూటింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.’’ అంటూ పేర్కొన్నారు. Manchu Manoj-Bhuma Mounika Reddy Love : మా ప్రేమ కథ అలా మొదలయ్యింది – … Read more

    తమ్ముడితో మరదలిపై మంచు లక్ష్మి ట్వీట్

    మంచు మనోజ్ పెళ్లికి అన్నీ దగ్గరుండి చూసుకున్న అక్క మంచు లక్ష్మి తాజాగా పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ‘రెండు హృదయాలు.. ఒక్కటే మనసు.. ఈ బంధం కలకాలం నిలిచిపోతుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఇందులో తండ్రి మోహన్‌బాబు, మనోజ్‌లతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. భూమా మౌనిక రెడ్డితో మనోజ్ రెండో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి ఇల్లు వీరి వివాహానికి వేదికైంది. తాజాగా మంచు లక్ష్మి ట్వీట్ చేయడంతో కపుల్స్‌కి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    అత్తారింటికి బయల్దేరిన కొత్త జంట

    వివాహ బంధంతో ఒక్కటైన మంచు మనోజ్- భూమా మౌనికా రెడ్డి హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌లోని మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం జరిగింది. లక్ష్మి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. గతంలో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్‌ నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. Courtesy Twitter:Manchu Manoj Courtesy Twitter:Manchu Manoj

    మంచు మనోజ్‌ పెట్టిన ఫొటో వైరల్‌

    భూమ మౌనికను వివాహం చేసుకున్న అనంతరం మంచు మనోజ్‌ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ఫొటోను పంచుకున్నాడు. పాణిగ్రహణం సందర్భంగా మౌనిక చేతుల పట్టుకున్నాడు మనోజ్‌. వారి ఇద్దరి చేతిని మరో పిల్లాడు పట్టుకున్నాడు. దీనికి శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మౌనిక కుమారుడు ధైరవ్ చెయ్యి అది. వీరిద్దరి బాధ్యత ఇప్పట్నుంచి నాదేనంటూ చెప్పకనే చెప్పాడు మనోజ్. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అయ్యింది. వీరిద్దరికి శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది.

    ‘లవ్‌ యూ అక్కా’ అంటూ మనోజ్‌ ఎమోషనల్‌!

    సినీ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనికల పెళ్లికి మంచు లక్ష్మీ ఇల్లు వేదికైంది. మెహందీ ఫంక్షన్‌ నుంచి సంగీత్‌, హల్దీ వంటి అన్ని కార్యక్రమాలను మంచు లక్ష్మీనే దగ్గరుండి చూసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్క గురించి మనోజ్‌ ఓ ఎమోషనల్‌ నోట్ రాశారు. ‘అక్కా ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌. లవ్‌ యూ అక్కా’ అంటూ తనను పెళ్లి కొడుకొను చేస్తున్న మంచు లక్ష్మీ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. గతంలో ప్రణతి … Read more

    ఘనంగా మంచు మనోజ్- భూమ మౌనికల పెళ్లి

    మంచు మనోజ్- భూమ మౌనికలు పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వేదమంత్రాల సాక్షిగా ఏడు అడుగులు వేశారు. మంచు- భూమ కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మంచు మనోజ్ వివాహం జరిగింది. మంచు లక్ష్మీ దగ్గరుండి సోదరుడు మనోజ్ వివాహం జరిపించింది. తన నివాసంలోనే పెళ్లి తంతును ఏర్పాటు చేసింది. మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    మెుదటి పెళ్లికి అతిథి..ఇప్పుడు ఆమెతోనే వివాహం

    మంచు మనోజ్‌, భూమా మౌనికా పెళ్లిబంధంతో ఒక్కటికానున్న వేళ వీరి గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. మనోజ్‌ ఇప్పటికే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని వివిధ కారణాలతో విడాకులు తీసుకున్నారు. మౌనిక కూడా బెంగళూరుకు చెందిన వ్యాపారిని పెళ్లి చేసుకొని మనస్పర్థలతో విడిపోయారు. ఈ పెళ్లికి మనోజ్‌ కూడా వెళ్లాడు. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవటం విశేషం. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి ఇంట్లో వీరి పెళ్లి జరగనుంది.

    కాబోయే భార్య ఫొటో షేర్‌ చేసిన నటుడు

    మంచు వారింట్లో పెళ్లి సందడి మెుదలైంది. అందరూ ఊహించినట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్‌ ఇవాళ వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కాబోయే భార్య ఫొటోను మనోజ్‌ షేర్ చేశారు. ‘కొత్త పెళ్లి కూతురు’ అంటూ ముస్తాబైన మౌనిక ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ పోస్టుకు ‘మనోజ్‌ వెడ్స్‌ మౌనిక’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేశారు.