మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన అన్నతో ఉన్న వివాదాన్ని మనోజ్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనిమనిషి పార్థసారథిని కొట్టడంపై మనోజ్ ఫైర్ అయ్యాడు. కాగా ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు దూరంగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఎదో వివాదం కొనసాగుతోందని వార్తలు వచ్చాయి.
మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట పడలేదు. విష్ణుతో గొడవల కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే పరిస్థితులన్ని కనిపించాయి. గత కొన్ని నెలలుగా వీరు మాట్లాడుకోవటం లేదు. మోహన్‌బాబు యూనివర్సిటీ స్నాతకోత్సవంలోనూ ఇద్దరూ పలకరించుకోకపోవటంతో గొడవలున్నాయని అందరూ భావించారు.
భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం కూడా విష్ణుకి ఇష్టం లేదని సమాచారం. అందుకే వివాహ వేడుకకు సంబంధించి ఏ పనుల్లోనూ జోక్యం చేసుకోలేదు. మంచు లక్ష్మీ తన ఇంట్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసి అన్నింటిని దగ్గరుండి చూసుకుంది. విష్ణు పెళ్లికి ఏదో అతిథిలా వచ్చి పోయాడంతే. దీంతో వివాహ విషయంలోనూ విబేధాలు తలెత్తాయని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?