• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shaakuntalam: అందాల  హోయలతో  దేవకన్యలా మెరిసిపోతున్న సమంత 

    శాకుంతలం మూవీ నుంచి సమంత కొత్త లుక్‌ను(Samantha New Posters) మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ కన్యలా సమంత న్యూలుక్ సూపర్బ్‌గా ఉంది. అభరణాలు పొదిగిన వస్త్రాలను ధరించి సామ్ మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు. స్టన్నింగ్ లుక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

    శాకుంతలం చిత్రం కోసం సామ్‌ సరికొత్తగా మేకోవర్ అయ్యింది. ఆమెను అత్యంత సుందరంగా తయారు చేసేందుకు బాగా శ్రమించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం కష్టపడింది. సమంతని పువ్వులతో తయారు చేసేందుకు వివిధ రకాల డిజైన్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల విడుదలయ్యింది.

     

    సినిమా మెుదలైన తర్వాత ఆమెకు మయోసైటిస్‌ వచ్చింది. దీంతో ఆమె అందం తగ్గిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. కానీ, శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా బయటకు వచ్చిన ఆమెను చూసి అందరూ స్టన్ అయ్యారు. 

    యశోద చిత్రం తర్వాత సామ్ నుంచి వస్తున్న సినిమా శాంకుతలం. వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్‌… దీనికోసం కూడా బాగానే కష్టపడింది. మయోసైటిస్ సమస్యలు వేధించినా షూటింగ్ పూర్తి చేసింది. 

    కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మణిశర్మ మ్యూజికల్‌లో వస్తున్న శాకుంతలం చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 

    ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ కూడా బాగుంది. VFX కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. గుణ టీం వర్క్స్‌తో పాటు దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 

    శాకుంతలం చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. సినిమా హిట్‌ అవుతుందని సమంతతో పాటు చిత్రబృందం నమ్ముతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv