టాలీవుడ్‌లో అచ్చమైన తెలుగు అందం ప్రియాంక జవాల్కర్. సంప్రదాయబద్ధంగా ఉంటూనే తన హాట్ లుక్స్‌తో మెప్పిస్తూనే ఉంటుంది ఈ హీరోయిన్.
గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక పెట్టే పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంత అందమైన ఫొటోలు పెడుతుంది మరి.
ప్రస్తుతం చీరకట్టులో దాగున్న సొగసులతో కనువిందు చేస్తోంది ఈ అనంతపురం చిన్నది. నడుము వయ్యారాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.
కలవరమాయే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తర్వాత 2018లో టాక్సీ వాలా సినిమాలో విజయ్ దేవరకొండతో ఛాన్స్ కొట్టేసింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అప్పట్నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సత్యదేవ్ హీరోగా బీర్బల్ ట్రయాలజీ రీమేక్ తిమ్మరసులోనూ హీరోయిన్‌గా చేసింది.
కిరణ్ అబ్బవరం నటించిన SR కల్యాణ మండపం చిత్రంలో ఆమె రోల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కాస్త బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మకి మంచి మార్కులే పడ్డాయి.
ఇటీవల కాలంలో రెడ్ సారీలో సెగలు పుట్టించింది ఈ భామ. ఆఫర్ల కోసం గ్లామర్ విషయంలో తగ్గేది లేదంటూ సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK 108 సినిమాలోనూ చేస్తోంది తెలుగమ్మాయి. ఏ రోల్‌లో చేస్తోందనే విషయంలో స్పష్టత లేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో పుట్టిన ఈ సుందరి ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాల్లోకి అడుగుపెట్టింది. గమనం చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!