• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

    ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాలు జరగకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని పలుమార్లు వారించినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్వీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం.

    వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం

    NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగా విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8మంది ఉన్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇది సార్ ఎన్టీఆర్ అంటే.. వీడియో వైరల్

    [VIDEO:](url) అభిమానులంటే ఎన్టీఆర్‌కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ యోగక్షేమాలను ఆరా తీసే నటుల్లో యంగ్ టైగర్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని నిలువరించి అభిమానితో ఫొటోకు పోజులిచ్చాడు. ఈ వీడియో చూసి ‘ఇది సార్ ఎన్టీఆర్ అంటే’ … Read more

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    రామ్‌ చరణ్‌కు అమిత్ షా సన్మానం

    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించారు. RRRలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు. షాలువా కప్పి అభినందించారు. ఆస్కార్ వేడుకల అనంతరం అమిత్ షా ఆహ్వానం మేరకు చిరంజీవితో కలిసి ఆయన షా నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    భారీగా పెరిగిన బంగారం ధర

    తెలుగురాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ. 53,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.270 పెరిగి 58,690కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,100కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం; 6 మంది దుర్మరణం

    ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మంది దుర్మరణం పాలయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద బొలెరో, ఆటో ఎదురెదురుగా వేగంగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో స్పాట్‌లోనే 5 మంది మృత్యువాత పడగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి; తెగిపడిన వేలు

    [వీడియో;](url) ఓ కొబ్బరి బోండాల వ్యాపారి బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ అధికారి వేలు తెగి కిందపడింది. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారి వ్యానులో కొబ్బరిబోండాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి అతడిని ఫిట్‌నెస్ పత్రాలు అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన వ్యాపారి కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ఆర్టీఓపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతడి వేలు తెగి కిందపడిపోయింది. … Read more

    TSPSC ప్రశ్నాపత్రం లీకేజీకి కారణం ఈమెనే!

    TSPSC ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురుకుల ప్రిన్సిపాల్ రేణుక మాస్టర్ మైండ్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఆమె తన తమ్ముడి కోసం ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. రూ.10లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ట్విస్ట్‌ ఏమిటంతే రేణుక తమ్ముడు చదివింది టీటీసీ. ఏఈ పరీక్షకు అర్హుడు కాదు. ప్రవీణ్ పంపిన ప్రశ్నాపత్రాన్ని రూ.14లక్షల చొప్పున రేణుక నీలేష్, గోపాల్ అనే అభ్యర్థులకు అమ్మినట్లు తెలిసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీలో … Read more

    రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more