• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు. 

    రూ.3000 పింఛన్

    బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పింఛన్‌దారులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. త్వరలోనే పెన్షన్‌ రూ. 3000లకు పెంచుతామని వెల్లడించారు. “ గత ప్రభుత్వం  ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి రూ.1000 ఇస్తే… రూ. 2250 పెంచి ఇప్పటికే 69 లక్షలమందికి ఇస్తున్నాం. దీన్ని రూ.2750కి పెంచాం. మళ్లీ జనవరి వచ్చే సరికి రూ.3 వేలకు పెంచి ఎన్నికలకు వెళ్తాం” అన్నారు.

    ఇంటింటికి ఫలాలు

    ఒకప్పుడు బడ్జెట్ పెడితే ఎవరికి ఏం మేలు జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఎవరికి ఏం ఫలితాలు అందాయో ప్రతి లెక్క చెప్పి మాకు మద్దతు పలకండని ఎమ్మెల్యేలు వివరించే స్థాయికి నాలుగేళ్ల పాలన జరిగిందని జగన్‌ వెల్లడించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు.  

    గ్రామస్థాయిలో అభివృద్ధి

    జిల్లాల పెంపుతో పరిపాలన సౌలభ్యాన్ని ప్రజలకు చేరువ చేశామన్న జగన్.. సచివాలయాల ద్వారా దాదాపు 600 రకాల సేవలు అందుతున్నాయని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అన్నదాతను వెంట నడిపిస్తున్న సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంచేలా సర్కారు చేసిందని గుర్తు చేశారు. “గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేసింది సున్నా. ఒకప్పుడు సర్వేయర్లు కనిపించాలంటే కళ్లు కాయలు కాయాల్సిన పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఏకంగా 10 వేల మందిని నియమించడం ద్వారా కబ్జాలకు స్వస్థి పలికేలా చేసింది మనందరి ప్రభుత్వం” అన్నారు. 

    మార్పు… జగన్‌ మార్క్‌

    “ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్‌ 1 గా నిలవటమనే అంశం ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం. పేద అక్కా చెల్లెళ్లకు ఇళ్ల స్థలాలు, కాలనీల నిర్మాణం వంటివి గ్రామ స్థాయిలో కనిపిస్తాయి. ఊరు నుంచి రాష్ట్ర రాజధానుల వరకు ఈ 45 నెలల పాలనలో మార్పు.. ఈ జగన్ మార్క్‌ కనిపిస్తుంది” అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

    ప్రభుత్వ బడులతో పోటీ

    శిథిలమైన బడులను కార్పోరెట్ స్థాయిలోకి మార్చి విధ్యావిధానాన్ని డిజిటల్ యుగంలోకి తీసుకెళ్లామని జగన్ తెలిపారు. ఒక మేనమామలా పిల్లలందరికీ తోడులా ఉంటున్నాని వెల్లడించారు. “ గవర్నర్‌ మెంట్‌ బడులను కార్పోరేట్ పాఠశాలలకు కాపీ కొట్టే పరిస్థితి వచ్చేలా మరో రెండేళ్లలో తీర్చిదిద్దుతాం. మనబడి , నాడు నేడు కార్యక్రమలాతో 45 వేల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి పూర్తిగా మారుతుంది” అన్నారు. 

    నా ఎకనామిక్స్.. నా పాలిటిక్స్‌

    తనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో,.. పింఛను అందుకుంటున్న వారు అంతే ముఖ్యమన్నారు జగన్. “ గతంలో గాల్లో మాటలు.. గ్రాఫిక్స్ చూపించను. నా నడక నేల మీదే.. నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే.. నా ప్రయాణం మాత్రం పేదవర్గాలతోనే… నా యుద్ధం పెత్తందారులతోనే… నా లక్ష్యం పేదరిక నిర్మూళన. కాబట్టే నా ఎకనామిక్స్ వేరు.

    పేద కుటుంబాలు బాగుపడితేనే పేద కులాలు బాగుంటాయి. వారికి అన్ని సాధికారికతలు ఇస్తేనే రాష్ట్రం బాగుంటుందు. ఇది నమ్మాను. నేను ఆచరించాను. ఫలితాలు చూపించాను. ఇదే నా ఎకనామిక్స్. నా పాలిటిక్స్. నా తండ్రిని చూసి నేర్చుకున్న విధానాలు. ఇవన్నీ కలిపితేనే మీ జగన్. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv