• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • TDP మహిళా నేతపై లైంగిక వేధింపులు-రాజీనామా

  కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వెల్లడించారు. పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. వేధింపులు తాళలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందునే.. ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించామని పార్టీ నేత ఓ ప్రకటనలో తెలిపారు.

  లోకేష్ పాదయాత్రకు షరతులతో అనుమతి

  AP: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కుప్పంలో మూడు రోజుల పాటు జరిగే యాత్రకు అధికారులు 15షరతులు విధించారు. కుప్పంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు 14 రకాల ఆంక్షలు విధించారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడా రోడ్‌షోలు నిర్వహించకూడదని పోలీసులు షరతు విధించారు. ప్రజలతో చేసే ఇంటరాక్షన్ బహిరంగ సభలా ఉండొద్దని తెలిపారు. మైకులో మాట్లాడాలని భావిస్తే పలమనేరు డీఎస్పీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27నుంచి 29వరకు కుప్పంలో … Read more

  40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అపూర్వ ఘట్టం

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సరిగ్గా నలభై ఏళ్ల క్రితం జనవరి 9న సంచలనం జరిగింది. రాష్ట్రంలో అరాచకాలకు, దిల్లీ పెత్తనానికి చరమగీతం పాడుతూ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియం అద్భుత ఘట్టానికి వేదిక అయ్యింది. దాదాపు మూడు దశబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిస్తూ.. తేదేపా అధికారం చేపట్టింది.1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణం చేశారు.

  ఏపీలో ఎమర్జెన్సీ మించిన పరిస్థితి

  ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి దాదాపు 2 గంటలపాటు రాష్ట్రంలో తాజాపరిస్థితులపై చర్చించారు. ఎవ్వరూ సమావేశాలు పెట్టకూడదని జీవో ఇచ్చి.. వైసీపీ వాళ్లు మాత్రం యథేచ్ఛగా చేస్తున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్రేనని విమర్శించారు. దీన్ని పోలీసులు అమలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాసిందని పవన్‌ ఆక్షేపించారు.

  చంద్రబాబు వల్ల నేతల విలువ పోతోంది: పెద్దిరెడ్డి

  కుప్పం పర్యటనలో చంద్రబాబు వ్యవహారశైలిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలు జుగుప్సాకరం. ఆయన వల్ల రాజకీయ నేతల విలువ పోతోంది. టీడీపీ కార్యకర్తలు పుంగనూరులో రాళ్ల దాడి చేశారు. పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. కుప్పంలో లాఠీఛార్జికి ఆయనే కారణం. జీవో నంబర్ 1 ప్రతిపక్షాలకు, వైసీపీకి అన్ని పార్టీలకు వర్తిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

  విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్

  విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.గుంటూరు తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. విజయవాడలోని సీసీఎస్ డీఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తీసుకొస్తారని సమాచారం. ఈ క్రమంలో డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అటు వైపు వచ్చే అన్ని మార్గాలను భారీకెడ్లతో మూసివేశారు. నిన్న చంద్రబాబు నిర్వహించిన గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనివాస్‌ను ఏ1గా కేసు నమోదు చేశారు.

  సైకిల్, సైకో బ్యాచ్‌ ఏం చేయలేవు: అంబటి

  ఏపీలో తనకు కాపులకు మధ్య విభేదాలు సృష్టించాలని టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సైకిల్, సైకో బ్యాచ్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా డైలాగ్‌లు కొట్టేవారిని ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులను కించపరుస్తూ మాట్లాడారని విమర్శించారు. టీడీపీ, జనసేన ఎన్నికుట్రలు చేసిన సత్తెనపల్లి ప్రజలు నమ్మరని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

  అన్నా క్యాంటీన్ కు నిప్పు

  మాచర్లలో అల్లర్లు చెలరేగి ఉద్రిక్తతలు ఏర్పడిన వేళ గుంటూరు జిల్లా తెనాలిలో అన్నా క్యాంటీన్ కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో క్యాంటీన్ తలుపుకు నిప్పు పెట్టి పరారయ్యారు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెదేపా నేతలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది నెలలుగా అన్నా క్యాంటీన్ వాడుకలో లేదు.

  ఏడాది పాటు ప్రజల్లోనే లోకేశ్

  AP: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 27నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభిస్తారు. చిత్తూరు- కుప్పం నుంచి శ్రీకాకుళం- ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ఏడాది పాటు లోకేశ్ ప్రజల్లోనే ఉండేలా టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. మార్గ మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. టీడీపీ తాజా ప్రకటనతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

  చంద్రబాబుపై రాయితో దాడి

  ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. ‘బాదుడే బాదుడు’ పేరిట నిరసన చేస్తున్న పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకు గాయమైంది. మధుబాబు దవడ కింద భాగంలో రాయి తగలడంతో..వైద్యులు వెంటనే చికిత్స అందించారు. పోలీసుల పోలీసుల భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటిి దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. వైకాపా రౌడీలను తాను భయపడబోనని తేల్చిచెప్పారు.