• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

    వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

    ‘గెలుపు సాధించే వరకూ పోరాడదాం’

    AP: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించేవరకూ పోరడాటమే దసరా స్ఫూర్తి అని ఆమె స్పష్టం చేశారు. ‘మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది. కలియుగ అసురులను అంతమొందించేవరకు పోరాడదాం’ అని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ పోస్టర్‌ను ఆమె జత చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రాహ్మణి ఈ వ్యాఖ్యలు చేశారు.

    నేడు టీడీపీ, జనసేన జేఏసీ తొలి భేటీ

    నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ భేటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ హాజరవుతారు. మ. 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ భేటిలో పవన్‌, లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొంటారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహార్‌ సమావేశానికి హాజరవుతారు.

    25 నుంచి ‘నిజం గెలవాలి’ యాత్ర

    AP: చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అదేరోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు.

    సీఎం పదవి కాదు ప్రజల భవిష్యత్తే ముఖ్యం: పవన్

    సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాను ఏరోజూ సీఎం పదవి కోసం విముఖత చూపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.

    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

    టీడీపీ కార్యకర్తలు, నేతల ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ను రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేశారు. ‘చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. కోర్టు ఆదేశాలు మేరకు చంద్రబాబు బ్యారక్ నందు టవర్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేశాము. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు.

    ‘చంద్రబాబు పట్ల దారణంగా ప్రవర్థిస్తున్నారు’

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్ష్య పనికిరాదన్నారు. వైద్యుల నివేదికలు పక్కన పెట్టి దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ల నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

    చంద్రబాబుకు స్కిన్ అలర్జీ

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఉక్కపోత కారణంగా ఆయనకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు ప్రకటించారు.

    ‘టీడీటీ అధికారంలోకి వస్తే పరిస్థితేంటి’

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలన్నారు. వాలంటీర్లు 90 శాతం మంది వైసీపీ మద్ధతుదారులు ఉన్నారని చెప్పారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మారుస్తామని బాలినేని పేర్కొన్నారు.

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.