• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు!

    ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో … Read more

    మళ్లీ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది; ఉపేంద్ర

    పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ తో మార్చ్‌ 17న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఉపేంద్ర. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్ ఫంక్షన్‌ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉందన్న ఉపేంద్ర.. తన పాత సినిమాల్లోని డైలాగ్స్‌తో అలరించాడు. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న RRR చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.

    TS; సర్పంచ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు

    [వీడియో;](url) స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపించారు. తనపై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ మహిళా నేతతో రాయబారం పంపారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యేతో బయటికి వెళ్తే డబ్బు, బంగారం, పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తనే భరిస్తాడని రాయబారం పంపినట్లు తెలిపారు. తననే కాదు మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. While #BRS MLC Kavitha Kalvakuntla is protesting … Read more

    ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more

    ధోనీ సిక్సర్ల మోత మొదలైంది

    [VIDEO](url): IPL 2023కి సమయం సమీపిస్తోంది. మార్చి 31న మహా క్రీడాసమరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక జట్లు శిక్షణా శిబిరాలను కూడా మొదలుపెట్టాయి. CSKను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలబెట్టిన MS ధోనీ కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌లో భాగంగా సిక్స్‌ కొట్టిన ఓ వీడియోను అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. ధోని సిక్సర్ల మోత మొదలైందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Dhoni smashing the ball ??@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ ? (@TheDhoniEra) … Read more

    నవ్వుతోనే పడేస్తున్న అనసూయ

    అందమైన యాంకర్లలో అనసూయ ఒకరు. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది అను. వీలు చిక్కినప్పుడల్లా ఫొటోలు, రీల్స్‌, వీడియోలు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చీరకట్టులో డిఫరెంట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. https://www.instagram.com/p/CpMlA-KjGLz/ Screengrab Instagram:itsme_anasuya Screengrab Instagram:itsme_anasuya

    జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేశారు; కొడాలి నాని

    [వీడియో;](url) జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొక్కేశారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు ప్రచారం చేయించుకుని.. ఆ తర్వాత కూరలో కరివేపాకులా పక్కన పడేస్తారని మండిపడ్డారు. తాతా మనవళ్లను ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవమానాలన్నీ జూ.ఎన్టీఆర్‌కు తెలుసని.. కానీ బయటికి చెప్పరని పేర్కొన్నారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడు: కొడాలి … Read more

    Ap; గవర్నర్‌ను కలసిన సీఎం దంపతులు

    [వీడియో; ](url)ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఏపీ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ బదిలీపై చత్తీస్‌గఢ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ … Read more

    మంత్రి కాళ్లు మెుక్కిన ఆలయ ఈవో

    ఏపీ: శ్రీశైలం ఆలయ ఈవో ఎస్‌.లవన్న మంత్రి పెద్దిరెడ్డికి [పాదాభివందనం](url) చేయడం విమర్శలకు దారితీసింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈవో లవన్న..పెద్దిరెడ్డి పాదాలకు నమస్కరించారు. శివదీక్ష ఉన్న ఈవో, మంత్రికి ఏ విధంగా పాదాభివందనం చేస్తారని విమర్శలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ఈవో పెద్దిరెడ్డి 75 సార్లు అయ్యప్ప, శివదీక్ష చేపట్టారని అందుకే గురుస్వామిగా నమస్కారం చేశానని వివరించారు. CM @ysjagan,When you’re questioned about an insulting poster of … Read more

    వీధి కుక్కలకు బలైన చిన్నారి

    [వీడియో;](url) అభం శుభం తెలియని ఓ చిన్నారి వీధి కుక్కల దాడికి బలైపోయాడు. వీధికుకక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో చోటుచేసుకుంది. ప్రదీప్(4) అనే చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా వదల్లేదు. ఒక కుక్క కాలు.. మరో కుక్క చేయి నోట కరుచుకుని లాగడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హైదరాబాదులో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి ? చిన్న … Read more