• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు!

    ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు రైల్వేశాఖ వివరించింది.

    తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రైళ్లలో భక్తులు కిక్కిరిసి పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే గతంలోనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు ఈ రైళ్లు సేవలు అందించాయి. చాలామంది భక్తులు ఈ సర్వీసుల ద్వారా తిరుపతికి వెళ్లి శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. స్పెషల్ రైళ్ల గడువు ముగుస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ఈ సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 

    టైమింగ్స్..

    సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 07489 నంబర్ గల రైలు ప్రయాణించనుంది. మార్చి 17, 24, 31(శుక్రవారం) తేదీల్లో ఈ రైలు తిరుపతికి బయలు దేరుతుంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 07490 నంబర్ రైలు 19, 26 తేదీల్లో ప్రయాణించనుంది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. 

    ఈ రూట్‌లో కూడా..

    సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కి వెళ్లే రైలు సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. మార్చి 19, 26వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రైలు బయలు దేరుతుంది. ఈ తేదీల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషను నుంచి ప్రారంభమై మరునాడు ఉదయం 7 గంటలకు దానాపూర్‌కి చేరుకుంటుంది. దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు మార్చి 16, 23వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. రాత్రి  8.50 గంటలకు బయలు దేరి మరునాడు ఉదయం 4.40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv