తెలుగురాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ. 53,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.270 పెరిగి 58,690కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,100కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.