NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.
సముద్రంలో సన్నివేశాలు
సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో తీసే సన్నివేశాలు ఉన్నాయని సినిమాటోగ్రఫీ చేస్తున్న రత్నవేలు తెలిపారు. దర్శకుడు కొరటాల శివ ఊహిస్తున్న చిత్రాన్ని కల్లకు కట్టినట్లుగా చూపించేందుకు ప్రయత్నిస్తామన్నాడు రత్నవేలు.
హద్దులు దాటి
దీనిబట్టి చూస్తే కోస్టల్ ఏరియాలో అతి క్రూరమైన మనుషుల మధ్య జరిగే పోరు. వారందరినీ భయపెట్టే వ్యక్తిగా తారక్ ఎదుగుతాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుంది. జనతా గ్యారేజ్ తర్వాత చాలా సందర్భాల్లో దర్శకుడు కొరటాల ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. హద్దులు దాటి మిర్చి సినిమా కంటే ఎక్కువ యాక్షన్ ఉంటుందని గతంలోనే చెప్పాడు. యంగ్ టైగర్ వంటి హీరోకి అలాంటి మాస్ కథ చిక్కితే ఇక పూనకాలే.
మూడేళ్లుగా ఎదురుచూపులు
దాదాపు మూడేళ్లుగా NTR30 సినిమా ప్రారంభోత్సవం కోసం అభిమానులు ఎదురుచూశారు. ఎట్టకేలకు సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. అతిథుల కోలాహలం మధ్య ముహుర్తం షాట్ తీశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మెుదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దర్శక ధీరులు
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. ముహుర్తం సన్నివేశానికి జక్కన్న క్లాప్ కొట్టగా.. కొరటాల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించి ప్రారంభించారు. స్క్రిప్ట్‌ను అందించారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.
జాన్వీ సందడి
సినిమా లాంఛ్ ఫంక్షన్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సందడి చేసింది. చీరకట్టులో తళుక్కున మెరిసింది ముద్దుగుమ్మ. కార్యక్రమానికి రాగానే ఎన్టీఆర్ ఆమె చేతి పట్టుకొని మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అప్పుడే మీమ్స్ కూడా వేశారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి