• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఒంగోలులో ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్

  నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్రైలర్ ఈ నెల 6న రిలీజ్ కానుంది. డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్వస్థలం ఒంగోలులో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రి రిలీజ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. ఈ మూవీలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

  చిన్నారుల కోసం ‘సితార’ ముందడుగు

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూతురు సితారా ఘట్టమనేని చిన్నారుల కోసం [వెబ్‌సైట్](url) ప్రారంభించింది. కొత్త సంవత్సరం రోజున maheshbabufoundation.org వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లు సితారా తెలిపింది. ‘‘మహేష్ ఫౌండేషన్ కోసం ఈ నెల నా పాకెట్ మనీని విరాళంగా ఇచ్చా. మీరు కూడా మీవంతుగా సాయం చేయండి. మనమందరం కలసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టింద్దాం.’’ అంటూ సితారా విజ్ణప్తి చేసింది. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు హార్ట్ సర్జరీలు జరుగుతున్న తెలిసిందే. #SitaraGhattamaneni papa happy to be launching our … Read more

  క్లాస్, మాస్ కాంబో; ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ లాంఛ్

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు. థ్రిల్లర్ మూవీగా, మల్టీ లింగ్వల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఖరారు చేయలేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  40 కి.మీ మైలేజ్‌తో స్విఫ్ట్, డిజైర్ కార్లు!

  మారుతి సుజుకీ మరో రెండు సరికొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లనే ఆధునీకరించి వచ్చే ఏడాది పరిచయం చేయనుంది. పెట్రోల్ వేరియంట్ కార్లను తీసుకురాబోతోంది. ఈ కార్లు 35 నుంచి 40 కి.మీ వరకు మైలేజ్ ఇస్తాయని సుజుకీ ప్రకటించింది. ప్రస్తుతం స్విఫ్ట్, డిజైర్ కార్లు 21 నుంచి 23 కి.మీ మైలేజ్ ఇస్తున్నాయి. ఇక వీటి ధర ఇప్పుడున్న కార్ల ధర కంటే మరో రూ.లక్ష నుంచి లక్షన్నర అధికంగా ఉండొచ్చని … Read more

  ‘ఆదిపురుష్‌ కన్నా ‘హను-మాన్‌’ టీజరే బాగుంది’

  యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘హను-మాన్’ చిత్రం టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్‌ను నెటిజన్లు ఆదిపురుష్‌ టీజర్‌తో పోలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఆదిపురుష్‌ కంటే హనుమాన్‌ టీజర్‌ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌లో విజువల్స్ అదుర్స్ అని పొగిడేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

  కవాసాకి నింజా 650 బైక్ లాంఛ్; ధర రూ.7 లక్షల పైనే

  కవాసాకి నుంచి మరో బైక్ లాంఛ్ అయ్యింది. 2023 నింజా 650 బైక్‌ను కవాసాకి ఇండియా భారతదేశంలో ప్రారంభించింది. ఈ బైక్ ప్రత్యేకతలు వింటే కళ్లు చెదిరిపోతాయి. ఈ బైక్ లైమ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్లతో ఈ బైక్ లభ్యమవుతుంది. 649 సీసీ బీఎస్6 ఇంజిన్ కలిగి ఉంటుంది. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. పెటల్ డిస్క్ బ్రేకులు, ఎలీఈడీ హెడ్ ల్యాంప్, 15 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో బైక్ మార్కెట్లోకి … Read more

  చీపెస్ట్ 5G ఫోన్ లాంఛ్

  భారత్ మార్కెట్‌లో చీపెస్ట్ 5G ఫోన్‌ను లాంఛ్ చేశారు. మొబైల్ తయారీ సంస్థ ‘లావా’ తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. బ్లూ, గ్రీన్ కలర్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 MAH బ్యాటరీ, డ్యూయెల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G, 4G ఎల్టీఈ, 700 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ముందుగా అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి … Read more

  స్మార్ట్‌ఫోన్ల కోసం ‘13 గో’ ఎడిషన్

  ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అద్భుత స్పెసిఫికేషన్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ప్రారంభించింది. ఈ వెర్షన్ ఫోన్‌లో అనవసర యాప్‌లు తొలగించి, అవసరమైన యాప్‌లు అందిస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్లు 3GB రామ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో యూజర్ల సేఫ్టీ కోసం ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్‌ఫోన్లకు గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్లు అందిస్తోంది. ఈ డివైజ్‌లు కీలక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు పొందవచ్చు. డివైజ్‌లలో స్టోరేజీకి తగినట్టుగా అప్‌డేట్స్ అందిస్తుంది.

  వాట్సాప్‌లో మరో 5 ఫీచర్లు

  వాట్సాప్ తన వినియోగదారుల కోసం త్వరలోనే మరో 5 ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. కాలానుగుణంగా వాట్సాప్ అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. వచ్చే 5 ఫీచర్లలో మెసేజ్ ఎడిట్, స్క్రీన్‌షాట్ బ్లాక్, గ్రూప్ మెంబర్స్ సంఖ్య, షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

  ‘ఎస్‌-ప్రెస్సో’ సీఎన్జీ ప్రత్యేకతలివే

  మారుతి సుజుకీ ‘ఎస్‌-ప్రెస్సో’ సీఎన్జీ వర్షన్‌ను నూతనంగా లాంఛ్ చేసింది మారుతి కంపెనీ. ‘ఎస్‌-ప్రెస్సో’ కారు ధర ఎక్స్ షోరూమ్ వద్ద రూ.5.90 లక్షలుగా ఉంది. సీఎన్జీతో ఈ కారు 32.73 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 55 లీటర్ల ఇంధన సామర్ధ్యం కలిగి ఉంటుంది. 1,000 సీసీ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, ఆటో గేర్ షిఫ్ట్, కే సీరీస్ ఇంజిన్‌ సౌకర్యాలు ఉన్నాయి.