• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పంచ్‌ ప్రసాద్

    జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ సీఎం జగన్‌, మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. వైద్య సహాయానికి CMRF నుంచి నిధులు మంజూరు చేసినందుకు రుణపడి ఉంటానని తెలిపాడు. తనకు అండగా నిలిచిన వారందరికి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. వారు చూపించిన ప్రేమాభిమానాన్ని ఎప్పటికి మర్చిపోలేనంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా, ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలిబడింది. This is how LEADER should be ✅@RojaSelvamaniRK ?#YSJaganCares … Read more

    TS: మంత్రికి తప్పిన ప్రమాదం

    తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ ‘చెరువుల పండుగ’ సందర్భంగా కమలాకర్ కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్ నగర్‌లోని ఓ చెరువు సందర్శనకు వెళ్లారు. చెరువులో ఆయన పడవపై ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. దీంతో కమలాకర్ నీటిలో పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆయనను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Minister and Karimnagar MLA Gangula Kamalakar escapes boat mishap, alert security rescues him … Read more

    కొనసాగుతున్న చేప మందు పంపిణీ

    నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కొనసాగుతోంది. 16 క్యూ లైన్ల ద్వారా జనాలు లోపలికి వెళ్తున్నారు. దాదాపు రెండు లక్షల చేపలకుపైగా మత్స్య శాఖ అందుబాటులో ఉంచింది. రేపు ఉదయం వరకు నిరంతరాయంగా చేప మందు పంపిణీ జరగనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతిని కల్పించాయి. ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ | Chepa Mandu Distribution | Hyderabad – TV9#tv9telugu #ChepaManduDistribution #Hyderabad pic.twitter.com/0Aen3pRaUY — TV9 Telugu (@TV9Telugu) June … Read more

    హృదయ విదారకంగా ప్రమాద దృశ్యాలు

    బాలేశ్వర్ రైలు ప్రమాదం దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డుల్లో శవాల కుప్పలు భీతి కలిగిస్తున్నాయి. క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 238కి పెరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇంకా బోగీల్లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు చూసుకునేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి. A country does not become great just because its Prime Minister changes clothes every hour. The country … Read more

    రైలు ప్రమాదంపై హైలెవల్ కమిటీ

    ఒడిశా- రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా.. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’ అని పేర్కొన్నారు. #WATCH | Railways … Read more

    నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి!

    ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డుమార్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లోకేశ్‌పై కోడిగుడ్డు విసరగా భద్రతా సిబ్బందికి తగిలింది. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై లోకేశ్ అక్కడే కూర్చుని నిరసనకు దిగారు. #WATCH | Andhra Pradesh | … Read more

    కవిత, సంజయ్‌ల ఆత్మీయ పలకరింపు

    తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ బీజేపీ నేత గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురై కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్‌రావును సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్, కవిత ఎదురుపడిన వేళ.. | MLC Kavitha | Bandi Sanjay … Read more

    రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

    చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం.. ధోని తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ‘ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో రిటైర్మెంట్ ప్రకటించడం చాలా తేలిక. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాలనుకుంటున్నా. ఇది ఫ్యాన్స్‌కు నా నుంచి అందించే గిఫ్ట్. స్టేడియంలో మ్యాచ్ జరిగిన క్షణాలు మరవలేను. స్టేడియంలో ధోని, ధోని నినాదాలు నా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. Thala happy and so are we ✨?pic.twitter.com/WfT3VybSUt — Chennai Super … Read more

    GSLV F-12 ప్రయోగం సక్సెస్

    ఇస్రో ప్రయోగించిన GSLV F-12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. GSLVF–12 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. తాజా ప్రయోగం సక్సెస్‌తో స్వదేశీ నావిగేషన్ సిస్టం బలోపేతం కానుంది. ఈ ఉపగ్రహం పనితీరుతో భూ, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో భూమిపై నావిగేషన్ సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. #WATCH | Indian Space Research Organisation … Read more

    అంబటి రాయుడు రిటైర్మెంట్

    చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి మ్యాచ్‌ అంటూ ట్వీట్ చేశాడు. రెండు టీమ్స్(MI, CSK) తరఫున 14 సీజన్లలో 204 మ్యాచ్‌లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్ ఆడాను. 5 ట్రోపీలు సాధించిన జట్లలో భాగస్వామిగా ఉన్నా. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం అంటూ పేర్కొన్నాడు. రాయుడు ట్వీట్‌పై CSK యాజమాన్యం స్పందించింది. ఈరోజు జరిగే మ్యాచ్ మంచి ముగింపు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది. 2 great … Read more