• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్పీకర్‌పై పేపర్లను విసిరేసిన సభ్యులు

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా మారాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చాలని బిల్లు పెట్టడంతో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్లను చింపేసి స్పీకర్‌పైకి పలుమార్లు విసిరేశారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని.. అందుకే ఆయన గౌరవార్థం పేరు పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతూ సభకు ఆటంకం కల్గించారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇలా TDP సభ్యులు సస్పెండ్ కావడం ఇది మూడోసారి. వారిని సస్పెండ్ చేసినప్పటికీ సభ్యులు బయటకు వెళ్లలేదు. … Read more

    మీ ఫ్యామిలీ ఎదురుచూస్తుంది: పోలీసులు

    రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ చిన్న [వీడియోను](url) రిలీజ్ చేశారు. వీడియోలో మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోందని చెబుతున్నట్లుగా ఉంది. వాహనం పరిమిత స్పీడుతో నడపాలని, మీ ఇంటి దగ్గర మీ పాప మీ కోసం వెయిట్ చేస్తుందని పేర్కొన్నారు. వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు మద్యం సేవించి కూడా వాహనం నడపొద్దని వాహనదారులకు సూచించారు. ఈ నిబంధలు తప్పకుండా పాటించి కుంటుంబానికి అండగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు … Read more

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు రెండు స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపెట్టిన బీజేపీ వీడియోలో హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్లై పేరు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ఇంట్లో సోదాలు చేసిన ఈడీ

    ప్రజలతో కొట్టిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యలు

    ఏపీ మంత్రి రోజా తెలుగుదేశం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లడితే ఊరుకునేదని లేదని, ప్రజలతో కొట్టిస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా, టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల గురించి చర్చిస్తున్నారని, అసలు జాబ్స్ గురించి అడిగే అర్హత టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు.

    పోలీసన్నా.. నీకు సలాం..!

    సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలకు తెగించి నలుగురిని కాపాడారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఈ సాహసం చేసిన ఆంజనేయులు, రాకేశ్‌లను నగర సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. వారి ధైర్య సాహసాలను కొనియాడారు. తన సర్వీసులో వీరి సేవలు గుర్తిండిపోతాయని కితాబిచ్చారు. ప్రజల భద్రత కోసం తామెప్పుడూ ముందుంటామని చాటిచెప్పారు. ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. నిజంగా ఈ పోలీసు అన్నలు గ్రేట్ కదూ..! Risking their lives , officers of City police … Read more

    చెప్పులు విడిచి నివాళులు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే, రెబల్ స్టార్ భౌతికకాయంపై పుష్పాంజలి ఘటించే ముందు చెప్పులు విడిచారు. ఈ ఒక్క ఘటనతో తన సంస్కారం ఎంత పెద్దదో నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ మాట్లాడించారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Cheppulu pakka vadhilesi Nivalulu arpincharu respect Sir ?? Thanks @PawanKalyan garu for … Read more

    ఆర్జీవీ వరుస ట్వీట్లు.. వైరల్

    రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఆర్జీవీ మరోరకంగా స్పందించారు. ఒక మహానటుడు చనిపోతే.. షూటింగ్ లు నిలిపివేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. రేప్పొద్దున ఇదే దుస్థితి నేటి తరం నటులకు ప్రాప్తిస్తుందని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప కళాకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు వంటి పెద్దవాళ్లకి విలువనిద్దామని.. షూటింగులు రెండు రోజులు నిలుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం … Read more

    నాన్నెలా ఉండాలో చెప్పిన కృష్ణం రాజు

    ఇవాళ ఉదయం పరమపదించిన లెజెండరీ యాక్టర్‌ రెబెల్‌ స్టార్ కృష్ణం రాజు తన నటనా జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు. తొలి నంది అవార్డు సాధించిన నటుడిగా ఘనకీర్తి పొందారు. విలన్‌ పాత్రలతో మొదలుపెట్టి హీరోగా ఎన్నో విజయాలు సాధించారు. ప్రొడ్యూసర్‌గానూ సక్సెస్‌ను చూశారు. అయితే అదంతా తన తండ్రి పెంపకంలోని గొప్పదనమంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో మా నాన్న గారే నిదర్శనమంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    ‘కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం’

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్ మునగడం వల్ల ఏర్పడిన రూ.1,020 కోట్ల నష్టం కేసీఆర్ కుటుంబమే భరించాలన్నారు. గతంలో కురిసిన వర్షాలకు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోకి నీరు చేరి 6 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కేసీఆర్‌ఫెయిల్డ్ తెలంగాణ, కాళేశ్వరం, కేసీఆర్‌లూటేడ్‌తెలంగాణ హాష్ ట్యాగ్స్ ఇచ్చి … Read more

    ‘మా సీఎంను ఏదైనా అంటే నాలుక కోస్తాం’

    ఏపీ సీఎం జగన్‌ను నారా లోకేశ్ ఏదైనా అంటే నాలుక కోస్తామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగాయే చెప్పాలన్నారు. ఎస్సీలు సంతోషంగా ఉన్నారని, పలు ఘటనలు జరిగిన క్రమంలో సీఎం ఏ విధంగా స్పందిస్తున్నారో చూశారా అంటూ నిలదీశారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కు దళితుల గురించి మాట్లేడే అర్హతే లేదన్నారు. 2024 ఎన్నికలకు రండి ఎవరు సీఎం అవుతారో చుద్దామని సవాల్ చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం సహా టీడీపీ నేతలు జగన్‌పై చేస్తున్న … Read more