• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జేపీ నడ్డా, నితిన్‌ భేటీ

    భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హీరో నితిన్‌ను కలిశారు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో నితిన్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితిన్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్‌ వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే అమిత్‌ షా జూనియర్‌ ఎన్టీఆర్‌ను … Read more

    చంద్రబాబుకు 12 మంది NSGలతో భద్రత

    ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు భద్రతను భారీగా పెంచారు. 8 మంది ఉన్న నేషనల్ సెక్యురిటీ గార్డ్(NSG) కమాండోల సెక్యూరిటీని 12కు పెంచారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కుప్పంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా మూడెంచల భద్రతను ఏర్పాటు చేసింది. కుప్పంలో ఇటీవల టీడీపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. Jagan Reddy can't do one good deed … Read more

    కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత.. అన్నా క్యాంటిన్ ధ్వంసం

    AP: చిత్తూరు- కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ- టీడీపీ కార్యకర్తలు బహాబాహికి దిగారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటిన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ ప్లెక్సీలను చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కుప్పంకు వచ్చారు. భారీ భద్రత మధ్య అన్నా క్యాంటిన్‌కు బయల్దేరిన చంద్రబాబు నడిరోడ్డుపై భైఠాయించారు. వైసీపీ దాడులకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు … Read more

    అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హీరో జూనియర్ ఎన్టీఆర్ బేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ వ్యూహంలో భాగంగానే షాను కలిసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ సేవలు దేశవ్యాప్తంగా ఉపయోగించుకునేందుకే కలిసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ భేటీకి రాజకీయ కారణాలే కానీ, ఎన్టీఆర్ ను అభినందించేదుకు కాదన్నారు. ఇక అమిత్ షా ఉపయోగం లేకుండా ఓ ఒక్కరిని కలవరని వెల్లడించారు.

    రేపిస్టులు మరణించే వరకు జైల్లోనే ఉండాలి: కేటీఆర్

    జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారన్న దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులు అరెస్టైన 45 రోజుల తర్వాత తెలంగాణ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. జువెనైల్ యాక్ట్, IPC & CrPCలో లొసుగుల కారణంగా రేపిస్టులు బెయిల్‌పై వచ్చారన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో 11 మంది రేపిస్టుల విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ … Read more

    ఒక్కసారి జనసేనవైపు చూడండి: పవన్ కల్యాణ్

    AP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం. నా కడశ్వాస వరకు నా కుటుంబం కన్నా మీరెక్కువ, ప్రజలెక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెబుతున్నా, రాజకీయాలను వదిలేదే లేదు. నిలబడే ఉంటాం. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం. ఇవ్వకపోతే.. పదవి లేకున్నా సేవచేస్తాం’ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి – … Read more

    గాంధీని గాంధమ్మగా పూజిస్తు గ్రామస్థుల బోనాలు

    జాతిపిత మహాత్మగాంధీని గాంధమ్మగా పూజిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం మొదటి ఆదివారం గ్రామ దేవతగా కొలుస్తున్నారు. అంతేకాదు పూలు, పసుపు, కుంకుమ, బోనం వండి నైవేధ్యం పెట్టి సంబురాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడో కాదు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేదారిపురం గ్రామస్థులు చేస్తున్నారు. అనేక ఏళ్లు చేస్తున్న ఆచారమని వారు చెబుతున్నారు. వారి పంటపొలాల్లో నాట్లు వేసేందుకు ముందు గాంధమ్మకు పూజలు చేస్తామని అంటున్నారు. పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్థులు భావిస్తున్నారు.

    నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1

    SSLV-D1 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన అజాదీ శాట్‌ను రోదసిలోకి పంపింది. ఈ రెండు ఉపగ్రహాలను కొద్దిసేపట్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. #WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota (Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs — ANI (@ANI) August 7, 2022

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి. ఆర్డర్ … Read more

    అచ్చం అలానే ఉన్న రంగరంగ వైభవంగా సిరిసిరి సాంగ్

    వైష్ణవతేజ్ యాక్ట్ చేసిన రంగరంగ వైభవంగా మూవీ నుంచి రిలీజైన సిరిసిరి మువ్వల్లోన లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. పాట ప్రశాతంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది ఆనంద్ సినిమా పాటలా ఉందంటున్నారు. ఆగస్టు 1న విడుదలైన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వైష్ణవ్ సరసన ఈ మూవీలో కేతికాశర్మ నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహించగా, సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.