• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కసారి జనసేనవైపు చూడండి: పవన్ కల్యాణ్

    AP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం. నా కడశ్వాస వరకు నా కుటుంబం కన్నా మీరెక్కువ, ప్రజలెక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెబుతున్నా, రాజకీయాలను వదిలేదే లేదు. నిలబడే ఉంటాం. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం. ఇవ్వకపోతే.. పదవి లేకున్నా సేవచేస్తాం’ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి – … Read more

    గాంధీని గాంధమ్మగా పూజిస్తు గ్రామస్థుల బోనాలు

    జాతిపిత మహాత్మగాంధీని గాంధమ్మగా పూజిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం మొదటి ఆదివారం గ్రామ దేవతగా కొలుస్తున్నారు. అంతేకాదు పూలు, పసుపు, కుంకుమ, బోనం వండి నైవేధ్యం పెట్టి సంబురాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడో కాదు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేదారిపురం గ్రామస్థులు చేస్తున్నారు. అనేక ఏళ్లు చేస్తున్న ఆచారమని వారు చెబుతున్నారు. వారి పంటపొలాల్లో నాట్లు వేసేందుకు ముందు గాంధమ్మకు పూజలు చేస్తామని అంటున్నారు. పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్థులు భావిస్తున్నారు.

    నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1

    SSLV-D1 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన అజాదీ శాట్‌ను రోదసిలోకి పంపింది. ఈ రెండు ఉపగ్రహాలను కొద్దిసేపట్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. #WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota (Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs — ANI (@ANI) August 7, 2022

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి. ఆర్డర్ … Read more

    అచ్చం అలానే ఉన్న రంగరంగ వైభవంగా సిరిసిరి సాంగ్

    వైష్ణవతేజ్ యాక్ట్ చేసిన రంగరంగ వైభవంగా మూవీ నుంచి రిలీజైన సిరిసిరి మువ్వల్లోన లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. పాట ప్రశాతంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది ఆనంద్ సినిమా పాటలా ఉందంటున్నారు. ఆగస్టు 1న విడుదలైన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వైష్ణవ్ సరసన ఈ మూవీలో కేతికాశర్మ నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహించగా, సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.

    సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్

    విశాఖ సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు అందరినీ తప్పుదోవ పట్టించిన వివాహిత సాయి ప్రియ భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్లి గల్లంతైనట్లు ప్రచారం ఆ క్రమంలో నేవీ సాయంతో బీచ్లో వెతికేందుకు ప్రభుత్వానికి కోటికిపైగా ఖర్చు ఆ తర్వాత పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయి ప్రియ తాజాగా ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ చేరిన సాయి ప్రియ తాను మేజర్ అని, తన ఇష్టమని పోలీస్ స్టేషన్ రాలేనని … Read more

    ఈతకు వెళ్లి ఏడుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతు

    ఏపీ అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పూడిమడక బీచ్‌లో శుక్రవారం ఈతకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని రక్షించగా, మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం జగన్, స్థానిక మంత్రి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వాన?

    హైదరాబాద్ లో మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో ) మౌలాలి 12.8 చర్లపల్లి 4.5 బాలానగర్ 3.8 హయత్ నగర్ 3.8 నేరేడ్ మెట్ 7.3 అల్వాల్ 4.88 మల్కాజ్ గిరి 5.12 ఫతే నగర్ 5.12 తిరుమలగిరి 4.3 బేగంపేట్ 3.5

    చనిపోయిన స్పైడర్లే రోబోలు

    అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన స్పైడర్లను( సాలీళ్లు ) తిరిగి ఉపయోగించుకునేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. స్పైడర్ మృతదేహాల్లోకి గాలిని జొప్పించడం ద్వారా వాటిని రోబోలుగా వాడుతున్నారు. వీటికి వారు ‘నీక్రోబాటిక్స్’ అని పేరు పెట్టారు. చిన్న చిన్న కీటకాలు పట్టుకోవడంతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ లో తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    చిన్నారికి పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్

    AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో … Read more