- రోడ్డు ప్రమాదంలో పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ సీటులో కుర్చునే వ్యక్తితో పాటు వెనుక సీటులో కుర్చునే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలనే చర్చ మొదలైంది. అసలు మన ప్రభుత్వ, అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- **కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం..**
- కారులో డ్రైవింగ్ సీటుతో పాటు వెనక సీటులో కూర్చునే వారు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలి.సీటు బెల్టు ధరించకపోతే ఫైన్ రూ.1000
- వెనుక సీటులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రాణాంతకమైన గాయాల భారీ నుంచి రక్షించుకోవచ్చు. సీటు బెల్టు ఉండటం వల్ల ప్రమాద సమయంలో వెనక సీటులో కూర్చున్న వ్యక్తి డాష్ బోర్డు, ముందు సీటుకు గుద్దుకోకుండా ఉంటాడు.
- **జాతీయ రహదారులపై** ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి
- షోల్డర్స్ కవర్ అయ్యేలే 3 పాయింట్స్ కలిగిన సీటు బెల్టు పెట్టుకోవాలి
- WHO ప్రకారం.. సీటు బెల్టులు ప్రాణాపాయాన్ని 25 శాతం తగ్గిస్తాయి.
- బ్యాక్ సీటు బెల్టు పెట్టుకోకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో పైన WATCH ON బటన్పై క్లిక్ చేసి చూడండి.
YouSay న్యూస్ & ఎంటర్టైన్మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv