• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కంటపడిన అరుదైన పుష్పం ‘రాఫ్లేసియా ఆర్నాల్డి’

    ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా ‘రాఫ్లేసియా ఆర్నాల్డి’ అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. ఇది చాలా అరుదుగా వికసిస్తుంది. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇది 3 అడుగుల వరకు పొడవు, 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. కానీ ఈ పుష్పం వికసించే సమయంలో దుర్వాసన వస్తుంది. నౌ దిస్ అనే ట్విటర్ పేజీలో ఈ [వీడియోను](url) షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. A man came across this rare flower … Read more

    కర్నూలులో రజకుల వినూత్న నిరసన

    కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై స్థానిక రజకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యాలయంలోకి గాడిదలను తీసుకెళ్లి రజకులు ఆందోళన చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ తమ గాడిదలను తీసుకెళ్లిన అధికారులు వాటికి తిండి పెట్టలేదని వారు ధర్నా చేశారు. అధికారుల తీరు వల్ల రెండు గాడిదలు చనిపోవడంతో పాటు మరికొన్ని గాయాల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ధోబీ ఘాట్లు నిర్మించడంతో పాటు గాడిదల ఆవాసానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

    ‘ఎన్టీఆర్‌పై హంతకులది కపట ప్రేమ’

    జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఉండాలా, యునివర్సిటీకి ఉండాలా అంటే తన ఓటు జిల్లాకేనని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ హంతకులే అతనిపై కపట ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే చంద్రబాబుకు మద్దతుగా ఉండి కన్న తండ్రినే చంపుకున్నారని ఆరోపించారు. ఆయన గౌరవం కాపాడలేనివారు బిడ్డలేలా అవుతారు, పశ్చాత్తాపం లేదా అంటూ నిలదీశారు. మరోవైపు సీఎం జగన్‌కు ఎన్టీఆర్ అంటే శత్రత్వం లేదని, గౌరవం, అభిమానం ఉన్నాయని చెప్పారు.

    పండుగల వేళ సైబర్ మోసాలతో జాగ్రత్త!

    పండుగల సమయంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైం సోషల్ మీడియాలో ఓ[ వీడియో](url)ను పోస్ట్ చేసింది. వీడియోలో ఏదైనా షాపుల వద్ద బట్టలు తదితర వస్తువులు కొన్న తర్వాత ఎటువంటి లాటరీ కూపన్‌లలో మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని కోరారు. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతికి మీ సమాచారం వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే గతంలో అనేక మంది లాటరీ బారిన పడి మోసపోయినట్లు వెల్లడించారు. సైబర్ మోసాల … Read more

    ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

    రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, డార్లింగ్ ప్రభాస్‌ల ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇద్దరి మేనరిజాలు పోలుస్తూ ఓ నెటిజన్ ఎడిట్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోలో ఇద్దరూ వారి వారి సినిమాల్లో ఒకే రకంగా నవరసాలు పండిస్తూ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రెబెల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas)

    బాలకృష్ణపై మంత్రి రమేష్ సంచలన వ్యాఖ్యలు

    టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరని ప్రశ్నించారు. NTRను కూలదొసినపుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. టీడీపీ పార్టీని లాక్కొని మీ బావ సీఎం కూర్చిలో కూర్చొలేదా అంటూ ఎద్దేవా చేశారు. ముందు బాబుకు బుద్దిచెప్పాలని రమేష్ హితవు పలికారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని, ఈ జాతికి NTRను దూరం చేసింది ఎవరని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండేందుకు ఓ జిల్లాకు పేరు పెట్టామని జోగి … Read more

    స్పీకర్‌పై పేపర్లను విసిరేసిన సభ్యులు

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా మారాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చాలని బిల్లు పెట్టడంతో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్లను చింపేసి స్పీకర్‌పైకి పలుమార్లు విసిరేశారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని.. అందుకే ఆయన గౌరవార్థం పేరు పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతూ సభకు ఆటంకం కల్గించారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇలా TDP సభ్యులు సస్పెండ్ కావడం ఇది మూడోసారి. వారిని సస్పెండ్ చేసినప్పటికీ సభ్యులు బయటకు వెళ్లలేదు. … Read more

    మీ ఫ్యామిలీ ఎదురుచూస్తుంది: పోలీసులు

    రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ చిన్న [వీడియోను](url) రిలీజ్ చేశారు. వీడియోలో మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోందని చెబుతున్నట్లుగా ఉంది. వాహనం పరిమిత స్పీడుతో నడపాలని, మీ ఇంటి దగ్గర మీ పాప మీ కోసం వెయిట్ చేస్తుందని పేర్కొన్నారు. వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు మద్యం సేవించి కూడా వాహనం నడపొద్దని వాహనదారులకు సూచించారు. ఈ నిబంధలు తప్పకుండా పాటించి కుంటుంబానికి అండగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు … Read more

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు రెండు స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపెట్టిన బీజేపీ వీడియోలో హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్లై పేరు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ఇంట్లో సోదాలు చేసిన ఈడీ

    ప్రజలతో కొట్టిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యలు

    ఏపీ మంత్రి రోజా తెలుగుదేశం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లడితే ఊరుకునేదని లేదని, ప్రజలతో కొట్టిస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా, టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల గురించి చర్చిస్తున్నారని, అసలు జాబ్స్ గురించి అడిగే అర్హత టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు.