• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంకీ మామను ‘పెళ్లి కానీ ప్రసాద్‌’ అంటూ పిలిచిన అభిమాని

    [VIDEO](url):విక్టరీ వెంకటేశ్‌, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమా అప్పట్లో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించింది. అందులో పెళ్లికాని ప్రసాద్‌గా వెంకటేశ్‌ అందరినీ ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లోనూ రైల్వేస్టేషన్‌లో పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలుస్తుంది. అయితే CCL ఫైనల్‌ మ్యాచ్‌ వేళ ఓ అభిమాని వెంకీ మామను పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలిచాడు. అది విని వెంకటేశ్‌ ఒక్కసారిగా సినిమాలో మాదిరిగానే రియాక్ట్‌ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Pelli kani prasad is ❤Haha venky sir reaction … Read more

    అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌

    [VIDEO](url): ఎన్టీఆర్‌కు అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా ఎంతో ప్రత్యేకమని మరోసారి నిరూపితమైంది. ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌.. అక్కడి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టమని ఒకసారి మాట్లాడతారా’ అని అడిగారు. అందుకు ఓకే చెప్పిన ఎన్టీఆర్‌.. ‘ఎలా ఉన్నారమ్మా..!’ అంటూ ఆ తల్లిని వీడియో కాల్‌లో పలకరించారు. సొంత కుటుంబ సభ్యుడిలా ఆప్యాయత కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Jr.NTR – Down To Earth … Read more

    యూట్యూబ్‌లో దూసుకుకెళ్తున్న ‘రావణసూర’ టీజర్‌

    రవితేజ లేటెస్టు మూవీ ‘రావణసూర’ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 90 లక్షల మంది టీజర్‌ను వీక్షించారు. కాగా అన్ని వర్గాల నుంచి టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో నటించగా ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు లేడీ లీడ్‌ రోల్స్‌లో చేశారు. ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

    పుష్ప పాటకు దుమ్మురేపిన అక్షయ్‌, నోరా ఫతేహి

    [VIDEO](url): బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకు డ్యాన్స్‌ వేసి అదరగొట్టాడు. బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహితో కలిసి ఓ ఈవెంట్‌లో అక్షయ్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నోరా స్టెప్పులకు అక్షయ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. Bollywood superstar #AkshayKumar & #NoraFatehi dancing for … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన సిద్ధార్థ్, అదితి

    [VIDEO:](url) లవర్‌ బాయ్‌ సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్ల మధ్య రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించ లేదు. అయితే తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి అదితి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ అనే పాటకు వీరిద్ధరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అదితి స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘మీ జోడీ చాలా బాగుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి … Read more

    హీరోయిన్‌లను తలదన్నే లుక్స్‌తో స్నేహారెడ్డి వీడియో!

    పాన్‌ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్‌ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో అంతే ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఇన్‌స్టాలో ఓ [వీడియో](url)ను పోస్టు చేసిన ఆమె మెుక్కలపై తనకున్న ప్రేమను తెలియజేశారు.. ‘మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం’ అని స్నేహారెడ్డి అన్నారు. … Read more

    చిరు పాటకు స్టెప్పులేసిన పీవీ సింధు

    [VIDEO](url): బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు డ్యాన్స్‌తో అదరగొట్టింది. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పాటకు డ్యాన్స్‌ వేసి ఆకట్టుకుంది. ‘బాసు.. వేర్‌ ఈజ్ ద పార్టీ’ పాటకు స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 3,32,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టప‌డ‌గా. . వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. కాగా సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఫొటోలు, రీల్స్‌ పెడుతూ సందడి చేస్తుంది. … Read more

    రంధ్రాలు పడిన బ్లౌజ్‌తో శ్రీముఖి హాట్‌ అందాలు!

    తెలుగు బుల్లితెర యాంకర్‌లలో శ్రీముఖి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అందం, చలాకీ తనంతో షోలలో ఆమె హంగామా అంతా ఇంతా కాదు. యాంకరింగ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. రంధ్రాలతో ఉన్న బ్లౌజ్‌ని ధరించి హాట్‌ హాట్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Twitter:sreemukhi Courtesy Instagram:sreemukhi

    అక్షయ్‌ పాటకు స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

    పాన్‌ ఇండియా స్టార్ రామ్‌చరణ్‌, బాలీవుడ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ అచార్యతో కలిసి చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ‘మై ఖిలాడీ తూ అనారి’ మూవీలోని టైటిల్‌ సాంగ్‌కు ఇరువురు డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన రామ్‌చరణ్‌ మరొక్కసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మరింత వైరల్‌ చేస్తున్నారు. Mega Power Star @AlwaysRamCharan & The Famous … Read more