ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నటెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన అనూహ్య నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. నిన్న, మెున్నటి వరకూ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్ అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా ట్విటర్ లోగోనే మార్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇవాళ ట్విటర్లో బ్లూ బర్డ్ లోగో ప్లేస్‌లో కుక్క బొమ్మ కనిపిస్తోంది. క్రిప్టో కరెన్సీ Dogecoinపై ఉండే బొమ్మను ట్విటర్ లోగోగా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ట్విటర్ లోగో మార్పుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. #TwitterLogo పేరుతో ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది.
భారత్‌కు చెందిన ఓ నెటిజన్ ట్విటర్ లోగో మారిందంటూ పెట్టిన ఓ పోస్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఒకప్పటి ట్విటర్ పిట్ట బాడీకి Doge తలను పెట్టి మార్ఫింగ్ చేశాడు.
డా. రోమన్ అనే వ్యక్తి ట్విటర్ కొత్త లోగోపై పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఫేస్బుక్, ట్విటర్లు తమ లోగోనే బెస్ట్ అని గొడవపడుతున్నట్లు ఉంది. ఈ క్రమంలో మధ్యలోకి హాకీ స్టిక్‌తో ఎంట్రీ ఇచ్చిన Doge వాటిని పక్కకు తరిమేసినట్లు మీమ్‌లో కనిపిస్తోంది.
మరో నెటిజన్ ట్విటర్ బర్డ్‌ను పోలిన Doge ఫొటోను క్రియేట్ చేశాడు. దాన్ని #TwitterLogo పేరుతో ట్విటర్లో పోస్టు చేశాడు. ఈ ఫొటో నవ్వులు పూయిస్తోంది.
ట్విటర్ పాత లోగో వద్దు… కొత్త లోగోనే ముద్దు అని నెటిజన్లు తమ మీమ్స్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్విటర్ లోగో స్థాయికి ఎదిగినందుకు Doge ను రెండు శునకాలు అభినందిస్తున్నట్లు ఉన్న మీమ్ ఆకట్టుకుంటోంది. శునకాలు Doge తలపైన రాజ కిరిటాన్ని పెడుతూ ప్రశంసించడం ఇందులో కనిపిస్తోంది.
గత రాత్రి పడుకునే ముందు బర్డ్‌తో ఉన్న ట్విటర్ లోగో లేచే సరికి Dogeగా మారిపోవడంపై ఆశ్చర్యపోతున్నట్లు ఓ నెటిజన్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.
ట్విటర్ లోగోలో జరిగిన మార్పులను సూచిస్తున్న ఓ ఫొటో ట్రెండింగ్ అవుతోంది. ఇందులో వివిధ సంవత్సరాల్లో ట్విటర్ లోగోలో జరిగిన మార్పులు కనిపిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!