• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అచ్చం అలానే ఉన్న రంగరంగ వైభవంగా సిరిసిరి సాంగ్

    వైష్ణవతేజ్ యాక్ట్ చేసిన రంగరంగ వైభవంగా మూవీ నుంచి రిలీజైన సిరిసిరి మువ్వల్లోన లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. పాట ప్రశాతంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది ఆనంద్ సినిమా పాటలా ఉందంటున్నారు. ఆగస్టు 1న విడుదలైన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వైష్ణవ్ సరసన ఈ మూవీలో కేతికాశర్మ నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహించగా, సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.

    ‘ఏరోస్పేస్ రంగంలో దేశానికే HYD ఆదర్శం’

    ఏరోస్పేస్ రంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో సమగ్రమైన ఏకోసిస్టమ్‌ను తెలంగాణ కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బలమైన, స్నేహపూర్వకమైన పారిశ్రామిక విధానాలతో ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ గమ్యస్థానంగా నిలిచిందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Hyderabad today has a comprehensive ecosystem for aerospace and defence industry. With … Read more

    రాజీనామాపై 10 రోజుల్లో నిర్ణయం: రాజగోపాల్ రెడ్డి

    తన రాజీనామాపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు ఇదంతా కేసీఆర్ ప్లాన్ అంటు విమర్శించారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణ అంటే కేవలం సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల మాత్రమే కాదన్నారు. కాంగ్రెస్లో ఎన్నో అవమానాలు భరించానన్నారు.

    హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వాన?

    హైదరాబాద్ లో మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో ) మౌలాలి 12.8 చర్లపల్లి 4.5 బాలానగర్ 3.8 హయత్ నగర్ 3.8 నేరేడ్ మెట్ 7.3 అల్వాల్ 4.88 మల్కాజ్ గిరి 5.12 ఫతే నగర్ 5.12 తిరుమలగిరి 4.3 బేగంపేట్ 3.5

    చనిపోయిన స్పైడర్లే రోబోలు

    అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన స్పైడర్లను( సాలీళ్లు ) తిరిగి ఉపయోగించుకునేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. స్పైడర్ మృతదేహాల్లోకి గాలిని జొప్పించడం ద్వారా వాటిని రోబోలుగా వాడుతున్నారు. వీటికి వారు ‘నీక్రోబాటిక్స్’ అని పేరు పెట్టారు. చిన్న చిన్న కీటకాలు పట్టుకోవడంతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ లో తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ఈ మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ అంకిత‌భావాన్ని మెచ్చుకోవాల్సిందే!

    తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలో కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ PHCలోని కుదురుముల్ల వద్ద ఒక మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్ కోవిడ్ వ్యాక్సినేష‌న్ అందించేందుకు మోకాళ్ల లోతు నీటిలో న‌డుచుకుంటూ వెళ్ల‌డం క‌నిపించింది. మా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అడ్డంకుల‌ను దాటుకొని ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని చెప్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఆమె అంకిత‌భావాన్ని మెచ్చుకుంటూ పోస్టు పెట్టింది. వీడియో చూసేందుకు … Read more

    బ్రిడ్జి మ‌ధ్య‌లో చిక్కుకున్న వ్య‌క్తిని కాపాడిన పోలీసులు

    గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలో వ‌ర్షాలు కుండ‌పోత‌గా కురుస్తున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న ఈ వ‌ర్షాలు వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్లు కార్లు, మ‌నుషులు నీళ్ల‌లో కొట్టుకుపోతున్న ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. తాజాగా హిమాయ‌త్ సాగ‌ర్ స‌ర్వీస్ రోడ్డు బ్రిడ్జి వ‌ద్ద ప్ర‌మాదం అంచున‌ ఉన్న ఒక వ్య‌క్తిని సైబ‌రాబాద్ పోలీసులు కాపాడారు. బ్రిడ్జి దాటేందుకు ప్ర‌య‌త్నించిన ఆ వ్య‌క్తి బైక్‌తో స‌హా అదుపుత‌ప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    కాంగ్రెస్ నేత జ‌ట్టు ప‌ట్టుకొని లాగిన పోలీసులు.. వీడియో వైర‌ల్

    నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారిస్తున్న నేప‌థ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈడీ విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బి.వి జుట్టు ప‌ట్టుకొని లాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై … Read more

    NDRF నిధుల్లో తెలంగాణకు సున్నా..ప్రశ్నించిన KTR

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా NDRF ఫండ్స్ ఫొటోలు జతచేశారు. వాటిలో 2018 నుంచి ఇప్పటివరకు NDRF నిధుల్లో కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఫండ్స్ ను ఇచ్చినట్లు మ్యాపులో పేర్కొన్నారు. 2020 హైదరాబాద్ వరదల నుంచి 2022 గోదావరి వరదల వరకు రాష్ట్రానికి సాయం అందించలేదన్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష అంటూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ ఇదేనా అని KTR … Read more

    రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఓటింగ్ నేప‌థ్యంలో ఎమ్మెల్యే సీత‌క్క ఓటు గంద‌ర‌గోళం

    నేడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క అయోమ‌యానికి గురైంది. దీంతో మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాలని ఆమె కోరింది. కానీ అందుకు అధికారులు అనుమ‌తించ‌లేదు. ఓటు వేసే క్ర‌మంలో బ్యాలెట్ పేప‌ర్‌పై పెన్ ఇంక్ ప‌డింద‌ని అందుకే మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాల‌ని కోరిన‌ట్లు సీత‌క్క తెలిపారు. తాను అనుకున్న అభ్య‌ర్థికే ఓటు వేశాన‌ని బ‌య‌ట‌కు వ‌చ్చాక సీత‌క్క ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కానీ దానిపై ఇంక్ పడ‌టంతో ఆ ఓటు చెల్లుతుందో లేదోన‌ని కాంగ్రెస్ వ‌ర్గాలకు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. … Read more