• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ఏడాది స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి ఏం చెప్పిందంటే..

    సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళీ బోనాల ఉత్స‌వాలు నిన్న ఘ‌నంగా ప్రారంభ‌మయ్యాయి. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే రంగం కార్య‌క్ర‌మం నేడు నిర్వ‌హించారు. జోగిని స్వ‌ర్ణ‌ల‌త భ‌క్తుల‌కు భ‌విష్య‌వాణిని చెప్పింది. పూజ‌లు మొక్కుబ‌డిగా చేస్తున్నారు. మీ సంతోషం కోసం పూజ‌లు చేస్తున్నారు నాకోసం కాదు. అయిన‌ప్ప‌టికీ నా బిడ్డ‌లు సంతోషంగా ఉంటే చాల‌ని పూజ‌ల‌ను స్వీక‌రిస్తున్నా. నా ధ‌నాన్ని మొత్తం దోచుకుంటున్నారు. న‌న్ను మీ ఇష్టం వచ్చిన రూపాల్లో మారుస్తారా? నేను స్థిరంగా కొల‌వుదీరాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది. ఇంకా భ‌విష్య‌వాణి ఏం చెప్పిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.

    వైభవంగా సాగుతున్న ఉజ్జయిని మహంకాళీ బోనాలు

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జాము నుంచి అతివలు బోనమెత్తి అమ్మవారి సన్నిధికి పోటెత్తారు. మంత్రి తలసాని దంపతులు తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత, కిషన్ రెడ్డి దంపతులు సహా అనేక మంది బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    ‘కేసీఆర్ దుర్మార్గమైన పాలన..లక్షల ఎకరాల్లో పంట నష్టం’

    తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే KCR మాత్రం జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పట్టించుకోలేదన్నారు. మరోవైపు కమిషన్లకు కక్కుర్తి పడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిండా మునిగిందన్నారు. వరదల్లో పలు చోట్ల అనేక మంది మృతి చెందినా కూడా కనీసం సంతాపం తెలుపలేదన్నారు. వర్షాలు వస్తున్నాయని 17 నియోజక వర్గాల్లో వారి మంత్రులను నియమించాలని కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. … Read more

    ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు..ప్రమాదం అంచున 25 గ్రామాలు!

    నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. కానీ ప్రాజెక్టు సామర్థానికి మించి వరద ప్రవాహం వస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 గేట్లలో 17 గేట్లను తెరచి నీటిని దిగువకు వదులుతున్నారు. కానీ 18వ గేట్ ఇంకా తెరచుకోలేదు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 60 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వస్తుందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఇంకొ … Read more

    జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా కారు అద్దాలు ధ్వంసం చేసిన TRS వర్గీయులు!

    వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారును TRS వర్గీయులు అడ్డుకున్నారు. ఆపై కారుపై రాళ్లతో దాడి చేశారు. ప్రోటోకాల్ వివాదంలో ఎమ్మెల్యే ఆనంద్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. మర్పల్లి మహిళా భవనం శంకుస్థాపన కార్యక్రమానికి సునీతా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఘటనలో జడ్పీ ఛైర్ పర్సన్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సునీతా పేర్కొన్నారు.

    30 మంది పిల్లలతో నీటిలో మునిగిన స్కూల్ బస్

    మహబూబ్ నగర్ లో ఇవాళ పెనుముప్పు తప్పింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు వరదనీటిలో చిక్కుకుంది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. భారీ వర్షాల కారణంగా కోడూరు దగ్గర అండర్ పాస్ లో భారీగా నీరు నిలిచింది. ఆ మార్గం గుండా డ్రైవర్ బస్సు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా నీటిలో ఇరుక్కుపోయింది.

    700ఏళ్ల తర్వాత మాతృ భూమికి కాకతీయుల వారసుడు

    కాకతీయుల పూర్వవైభవాన్ని చాటిచెబుతూ కాకతీయ సప్తాహం ఉత్సవాలు వరంగల్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టత, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్-బస్తర్‌లో కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అసలు నిజంగా కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారా? ప్రతాప రుద్రుడి తర్వాత కాకతీయులు ఎటు … Read more

    చూస్తారా చీకటి వెలుగుల్లో భాగ్యనగర సోయగాలు

    హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక సొగసులను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అలాగే దాబాపై నిలుచుని విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న భాగ్యనగర అందాలను చూసి మురిసిపోని వారుండరు. అలాంటి సమయంలో పక్షిలా నగరమంతా వీక్షిస్తే ఎంత బాగుటుందో అని ఊహించుకుంటారు. అలా చేయలేకపోయినా ఆ సుందర దృశ్యాలను మాత్రం చూడొచ్చు. ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియోలో హైదరాబాద్ అందాలు మైమరచిపోయేలా చేస్తున్నాయి.

    TRS వాళ్లని అరెస్ట్ చేయాలని వర్షంలో తడుస్తు షర్మిల నిరసన

    YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వర్షంలో తడుస్తు నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా లక్కవరంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో షర్మిల చేపట్టిన దీక్షకు వ్యతిరేకంగా TRS కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో షర్మిల టీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తూ నిరసన దీక్షకు పూనుకున్నారు. వర్షంలో సైతం కొనసాగిస్తున్నారు. TRS కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

    అడవిలో పుట్టిన అగ్గిరవ్వ అల్లూరి సీతారామరాజు

    ఆంగ్లేయులకు ఎదురు నిలబడి పోరాడి, తెల్ల దొరల తలలు తిరిగేలా చేసిన వీరుల్లో తెలుగు గడ్డ మీద పుట్టిన బిడ్డ అల్లూరి సీతారామరాజు ఒకరు. అడవినైనా తగలబెట్టేందుకు నిప్పు రవ్వ చాలన్నట్లు…ఒక్కడే సైన్యాన్ని నిర్మించుకుని ఉద్యమ బాట సాగించారు. ఆంగ్లేయుల అరాచకాలకు ఎదురొడ్డి గిరిజన బిడ్డలకు అండగా నిలిచాడు. చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి అమరుడయ్యారు. జూలై 4న ఏటా ఏపీ ప్రభుత్వం అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. 125వ జయంతి సందర్భంగా ఈ ఏడు భీమవరంలో 30 అడుగుల … Read more