• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. … Read more

    వావ్ అనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్స్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటస్ట్ లుక్స్‌లో అదరగొట్టారు. ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాన్లీ లుక్స్‌తో వావ్ అనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ నీలిరంగు డెనిమ్ షర్ట్‌లో కనిపించారు. ఒక కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన లుక్స్‌గా తెలుస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్.. ఎన్టీఆర్ లుక్స్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ [వీడియో](url) ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో మూడు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. Here is the BTS video of Man of … Read more

    నాకు విల్లా కొనిచ్చిన హీరో ఎవరంటే..:రష్మీ

    సెలబ్రిటీలపై నిత్యం ఏదో ఒక పుట్టుకొస్తూనే ఉంటుంది. అయితే అందులో కొన్ని వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసేలా ఉంటాయి. ఇటీవలే యాంకర్‌, నటి రష్మీీ ఓ విల్లా కొనుక్కుంటే అది ఓ హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పుకారు పుట్టించారు. దీనిపై శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రష్మి స్పందించింది. తనకు ఎవరూ ఏదీ కొనివ్వలేదని.. కష్టపడి సంపాదించిన డబ్బుతో తానే కొనుక్కున్నానని చెప్పుకొచ్చింది.

    అల్లు అర్హ బర్త్‌డే; క్యూట్ వీడియో వైరల్

    సౌత్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు అర్హకు సంబంధించిన ఓ [వీడియో](url) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నవంబర్ 21న అర్హ బర్త్‌డే సందర్భంగా ఈ వీడియో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. కందిరీగల గురించి తన నాన్నకు ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. తెలుగులో చాలా క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను బన్నీ పోస్ట్ చేస్తూ ‘‘ హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ బేబీ అర్హ’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Happy Birthday … Read more

    ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’

    తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ వీడియో రూపొందించారు. కృష్ణ నటించిన ఆనాటి సినిమాల్లోని సీన్స్, మహేష్ నటించిన సినిమాల్లోని సీన్స్ కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఈనెల 15న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. SuperStars "#Krishna – #MaheshBabu" … Read more

    మిస్ యూ తాతయ్య; గౌతమ్ భావోద్వేగం

    తన తాత సూపర్‌స్టార్ కృష్ణ మృతితో గౌతమ్ ఘట్టమనేని ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో తన తాతతో కలసి దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘మీరు ఎక్కడ ఉన్నా నేను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటావని తెలుసు. మిస్ యూ తాతయ్య’’ అంటూ పోస్ట్ చేశాడు. కాగా ఇటీవల గుండెపోటుతో సూపర్‌స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    బట్టుబొమ్మ ఇంటిని చూశారా..!

    హీరోయిన్ ‘పూజా హెగ్దే’ గతేడాది ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హోం టూర్‌లో భాగంగా ఈ బుట్టబొమ్మ తన ఇంటిని చూపించింది. తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని డిజైన్ చేయించుకున్నానని పూజా తెలిపింది. ఓపెన్ కిచెన్ అంటే ఇష్టమని, కారిడార్ స్ఫూర్తి కలిగించేలా ఉండాలని అభిప్రాయపడింది. వర్క్‌స్పేస్‌ని చూపిస్తూ.. ట్రెండీ క్లాసీ లుక్కులో కనిపించడం తనకిష్టమనిచెప్పింది. లండన్, న్యూయార్క్ నగరాల్లోని స్టైల్ ఉట్టిపడేలా తన ఇంటిని తీర్చిదిద్దానని చెప్పింది.

    తన కూతురి తెరగేట్రంపై రోజా క్లారిటీ

    తన పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే చాలా సంతోషిస్తానని మంత్రి రోజా అన్నారు. నటన తప్పు అని నేనెప్పుడూ చెప్పను. వారు సినిమాల్లోకి వస్తామంటే నిజంగా నేను చాలా సంతోషిస్తా. కానీ నా కూతురు సైంటిస్ట్‌ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. ఇప్పటికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. వస్తే ఒక హీరోయిన్‌గా, ఒక తల్లిగా అండగా నిలుస్తా’ అని రోజా అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

    తాత నాకు చాలా నేర్పించారు:సితార

    సూపర్ స్టార్ కృష్ణ మృతితో మహేశ్ కుమార్తె సితార భావోద్వేగానికి లోనయ్యింది. కృష్ణ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. “ఇక నుంచి వారాంతంలో మధ్యాహ్నం భోజనం ఒకేలా ఉండదు. మీరు నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. నన్ను ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చేశారు. కానీ, ఇప్పుడు మీ జ్ఞాపకాల మాత్రమే మిగిలాయి. మీరు నాకు హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడేలా చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాతగారు” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

    రష్మిక మందనాకు సారీ చెప్పిన వార్నర్

    ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ‘వాటే బ్యూటీ’పాటలోని.. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు’ అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో చేసినందుకు రష్మిక మందన్నకి సారీ అంటూ కామెంట్ కూడా … Read more