దసరా చిత్రం నుంచి మేకింగ్ వీడియో
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమాలోని ఓరి వారి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాని లుక్ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ పేలుతున్నాయి. మాస్ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.