ప్రతీసారి విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో తేజా సజ్జా. ఆయన చేసిన జాంబిరెడ్డి, ఇష్క్ రెండూ సినిమాలు అలాంటివే. దీంతో తేజ సినిమాలు అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారు. ‘అద్భుతం’ మూవీపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు స్టోరీ ప్రశాంత్ వర్మ అందించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈరోజు నుంచి సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ స్టోరి ఏంటి ? ఎలా ఉంది? తెలుసుకుందాం
ఒకే ఫోన్ నంబర్ ఇద్దరికీ ఉంటే వచ్చే కన్‌ఫ్యూజన్‌తో స్టోరీ ఉండబోతుందని ట్రైలర్లు, టీజర్లు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇద్దరికీ ఒకే ఫోన్ నంబర్ ఎలా ఉంటుంది అనేదే కథలో అసలు ట్విస్ట్. సూర్య(తేజ) జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఇక వెన్నెల (శివాని రాజశేఖర్) ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో సూర్య తన నంబర్‌కు తానే ఈ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు అని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ సేమ్ నెంబర్ ఉన్న వెన్నెలకు వెళ్తుంది. దీంతో ఫోన్ ద్వారా ఇద్దరు పరిచయం అవుతారు. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడతారు.. కలుసుకోవాలని అనుకుంటారు. అక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..!
ఈ సినిమా చూస్తుంటే రీసెంట్‌గా వచ్చిన ప్లేబ్యాక్ సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది కూడా టైమ్ ట్రావెల్ కథ. ఇద్దరు వేర్వేరు టైమ్ జోన్స్‌లో ఉన్నామని తెలుసుకున్నాక ఎలా కలుసుకుంటారు అనేదే స్టోరి. అయితే ఫస్ట్ హాఫ్‌లో స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా నడిపిన దర్శకుడు సెకండాఫ్ వచ్చేసరికి నేరుగా పాయింట్ చెప్పకుండా లవ్‌స్టోరీని సాగదీశాడు. దీంతో చూసే ప్రేక్షకులు సహనంతో ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే సత్య తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఓటీటీలో విడుదల చేస్తున్నారు కాబట్టి సినిమా నిడివి కాస్త తగ్గించాల్సింది.
చైల్డ్ యాక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన తేజ నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన పాత్రకు తగినట్లు అద్బుతంగా నటించాడు. ఇక శివాని రాజశేఖర్ కూడా మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపించింది. సత్య కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. మొత్తం మీద సినిమా పేరు తగ్గట్లు అద్భుతంగా లేకపోయినా ఓటీటీలో కాబట్టి వారాంతంలో ఒకసారి చూడొచ్చు అనేట్టుగా ఉంది. పాటలు బాగున్నాయి.
రేటింగ్ 2.75/5
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్