‘ఓరి వారి నీది గాదురా పోరి’ సాంగ్ ప్రోమో
నాని ‘దసరా’ మూవీ నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. ‘ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే గీతాన్ని సంతోష్ నారాయణన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా రేపు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి పాటకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై అంచనాలు పెరిగాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 5 భాషల్లో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.