ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యింది
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మళ్లీ మళ్లీ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యిందంటూ చిత్ర యూనిట్ పాటను విడుదల చేశారు. హిపాప్ తమిజా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న ట్రైలర్ విడుదల కానుంది.