• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిల్లీ బిల్లీ సాంగ్: వెంకీ మామ, సల్మాన్‌ ఖాన్‌ స్టెప్పులు

    బాలివుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్ హీరోగా వస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. టాలివుడ్‌ హీరో వెంకటేశ్‌ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్‌ విడుదల కాగా.. తాజాగా బిల్లీ బిల్లీ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. తమిళ సినిమా ‘వీరమ్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కానుంది.

    ఆకట్టుకుంటున్న బలగం పాటలు

    కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇందులోని ఊరు పల్లెటూరు అనే పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. రామ్ మిర్యాల, మంగ్లీ పాడిన పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమాకు బీమ్స్‌ సంగీతం అందించారు. ఇటీవల ధమాకాతో సూపర్ హిట్‌ అందుకున్న బీమ్స్‌ ఖాతాలో బలగంతో మరో ఆల్బమ్ చేరింది. చిత్రంలో ప్రియదర్శి, కావ్య ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 3న చిత్రం విడుదలవుతోంది.

    నేడు నవీన్‌ పొలిశెట్టి సినిమా టైటిల్‌ రివీల్

    [VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్‌ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నవీన్‌… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇవాళ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్‌ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. Get ready for a crazy ride tomorrow ? Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar … Read more

    రేపు టైటిల్‌ చెప్తానంటున్న నవీన్ పొలిశెట్టి

    [VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్‌ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నవీన్‌… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రేపు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్‌ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. Get ready for a crazy ride tomorrow ? Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar … Read more

    ‘సామజవరగమన’ ఫస్ట్‌ గ్లింప్స్‌తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు

    భిన్నమైన కథాంశాలతో చిత్రాలు చేస్తూ నటుడు శ్రీ విష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాాగా ఆయన చేస్తున్న ‘సామజవరగమన’ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇవాళ శ్రీ విష్ణు పుట్టిన రోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) అందరిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజిల్ మూవీ ఫేం రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

    బలగం ట్రైలర్ వచ్చేసింది

    ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం బలగం. కల్యాణ్ ప్రియదర్శి, కావ్య నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మార్చి 3న సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ ఉంది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. బీమ్స్‌ సంగీతం అందించగా… వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు.

    ఆర్ఆర్ఆర్‌ చిత్రం రీ రిలీజ్‌ ట్రైలర్‌

    రామ్‌, భీమ్ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌ చిత్రాన్ని రి రిలీజ్ చేస్తున్నారు. మార్చి 3న 200 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర యూనిట్‌ రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గతేడాది విడుదలైన రాజమౌళి కళాద్భుతం… సుమారు 1200 కోట్లు వసూలు చేసింది.. మరి ఇప్పుడు ఎంత కొళ్లగొడుతుందో చూడాలి.

    ఈ వారం(March 3) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు

    ఫిబ్రవరి నెలలో సినిమా రిలీజ్‌లు ముగిశాయి. ఈ వారం(మార్చి 3)లో పెద్ద సినిమాల సందడేమీ లేదు. పరీక్షల సమయం కావడంతో బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయట్లేదు. ఈ శుక్రవారం 5 చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కాననున్నాయి. అవేంటో చూద్దాం.  బలగం కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా వ్యవహరించిన చిత్రమే ‘బలగం’. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్ తదితరులు … Read more

    మరపురాని మూవీ కోసం సిద్ధంగా ఉండండి!

    [VIDEO](url): మాస్‌ మహారాజ్‌ రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. ఔట్‌పుట్‌ విషయంలో మేకర్స్‌ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తామని ‘అభిషేక్‌ పిక్చర్స్‌’ తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ చీర్స్‌ చెబుతున్న వీడియోను పోస్టు చేసింది. రావణాసుర చిత్రం ఏప్రిల్‌ 7 థియేటర్లలో సందడి చేయనుందని, మరపురాని సినిమా అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని సూచించింది. #Ravanasura shooting has wrapped up, and all … Read more

    విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. విరూపాక్ష మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రవారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. Get ready to Enter the World of #Virupaksha ?️? 'Supreme … Read more