ఫిబ్రవరి నెలలో సినిమా రిలీజ్‌లు ముగిశాయి. ఈ వారం(మార్చి 3)లో పెద్ద సినిమాల సందడేమీ లేదు. పరీక్షల సమయం కావడంతో బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయట్లేదు. ఈ శుక్రవారం 5 చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కాననున్నాయి. అవేంటో చూద్దాం.
బలగం
కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా వ్యవహరించిన చిత్రమే ‘బలగం’. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హన్షిత్ నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. మార్చి 3న సినిమా విడుదల కానుంది.
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సొహైల్, మృణాళిని రవి జంటగా నటించారు. మీనా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. 44 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ని పూర్తిచేయడం విశేషం. ఈ సినిమాను మార్చి 3న విడుదల చేయనున్నారు.
సాచి
బిందు అనే యువతి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే మహిళా సాధికారతను ప్రోత్సహించే సినిమాగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. వివేక్ పోతగోని డైరెక్షన్ వహించి, నడిపల్లి ఉపేన్‌తో కలిసి నిర్మించారు. మార్చి 3న ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
రిచిగాడి పెళ్లి
బాల్యంలో ఆడుకున్న ఆటల్ని మనల్ని మరచిపోలేం. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘రిచిగాడి పెళ్లి’. కేఎస్ ఫిల్మ్‌వర్క్స్ నిర్మాణంలో వస్తోందీ చిత్రం. కేఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించారు. సత్య, చందన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా మార్చి 3న విడుదల కానుంది. మానవ సంబంధాల్ని ఆవిష్కరించే కథతో తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.
గ్రంథాలయం
విన్ను మద్దిపాటి ప్రధాన పాత్రధారిగా చేసిన చిత్రం ‘గ్రంథాలయం’. యాక్షన్ త్రిల్లర్ జానర్‌గా తెరకెక్కింది. వైష్ణవి శ్రీ.ఎస్ నిర్మాతగా వ్యవహరించారు. జంపన సాయి శివన్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.
OTT విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
Walteir Veerayya | Movie | Telugu | Netflix | February 27 |
HeatWave | Movie | English | Netflix | March 1 |
The Mandalorian S3 | Web Series | English | Disney Hotstar | March 1 |
Sex/Life S2 | Web Series | English | Netflix | March 2 |
Thalaikoothal | Movie | Tamil | Netflix | March 3 |
Alone | Movie | Malayalam/Telugu | Disney Hotstar | March 3 |
Daisy Jones & The Six | Web Series | English | Amazon Prime | March 3 |
Taj: Divided by Blood | Web Series | English | Zee5 | March 3 |
Gulmohar | Movie | Hindi | Disney Hotstar | March 3 |
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం