• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దసరా’ నుంచి మరో సాంగ్ రిలీజ్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ మూవీ నుంచి మరో సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘చమ్కీల అంగీలేసీ.. ఓ వదినే’’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సుధాకర చెరుకూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. సాయికుమార్, సముద్ర ఖని, దీక్షిత్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. మార్చి 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

    NTR30: జాన్వీ కపూర్‌కు భారీ రెమ్యూనరేషన్‌!

    NTR30 చిత్రంలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్న జాన్వీ.. తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. కాగా RC15లో నటిస్తున్న మరో బాలీవుడ్‌ కియారా రూ.3.5 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. కల నెరవేరింది టాలీవుడ్‌లో తారక్‌తో నటించాలని ఉన్నట్లు చాలాకాలంగా చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె పేరు ఎక్కువగా … Read more

    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?

    తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.  పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన … Read more

    ‘వెన్నెల్లో ఆడపిల్ల’ సాంగ్ రిలీజ్

    కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ‘బెదురులంక 2012’ సినిమా నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ రిలీజ్ అయింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. విస్సాప్రగడ కిట్టు లిరిక్స్ అందించాడు. హారికా నారయణ్, జేవీ సుదాన్షు ఈ పాటను ఆలపించారు. క్లాక్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రవీంద్ర బెనర్జీ నిర్మాతగా వ్యవహరించారు. అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది.

    ‘చమ్కీల అంగిలేసి’ దసరా సాంగ్‌ ప్రోమో

    మార్చి 30న థియేటర్లలో సందడి చేయబోతున్న నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, పాటలు, ఈవెంట్లతో సందడి మొదలుపెట్టిన చిత్రబృందం మరో పాట ప్రోమోను విడుదల చేసింది. చమ్కీల అంగిలేసి అంటూ మరో పాటను విడుదల చేయబోతోంది.శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నాని సరసన నటిస్తోంది.

    ‘భోళా’ ట్రైలర్‌ వచ్చేసింది

    తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌గా వస్తున్న హిందీ సినిమా ‘భోళా’. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన ఖైదీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ఇందులో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ సందడి చేయబోతున్నారు. మార్చి 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

    MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు

    వేసవి సెలవులకు సమయం ఉండటంతో పెద్ద చిత్రాలు రాకముందే చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. స్పసెన్స్‌ థ్రిల్లర్లు, మోస్ట్ వెయిటింగ్ వెబ్‌ సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.  సీఎస్‌ఐ సనాతన్‌ ఆది సాయి కుమార్‌, మిషా నారంగ్‌ జంటగా నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది… ఈ … Read more

    ‘రావణాసుర’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రవితేజ!

    మాస్‌ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తే విలన్ ఏమో అన్న సందేహం కూడా కలుగుతోంది. రావణాసురపై అంచనాలను మరింత పెంచేలా టీజర్‌ … Read more

    ‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో అద్భుత చిత్రం!

    [VIDEO](url): యువ నటుడు సంతోష్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, చక్కని హాస్యంతో చూడముచ్చటగా ఉంది. ‘సీతారామం’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన ‘స్వప్న సినిమా’ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి,వెన్నెల కిషోర్ … Read more

    ‘నాటకరంగం వేరు’ పాట విడుదల

    రంగమార్తాండ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘నాటకరంగం వేరు.. జీవితరంగం వేరు’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా స్వరాలు సమకూర్చి పాటను ఆలపించారు. ఇదే సినిమాలోని ‘పువ్వై విరిసే ప్రాణం’ పాటకి రీప్రైసిడ్ వెర్షన్‌గా దీనిని రూపొందించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.