• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

    చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా … Read more

    ‘దసరా’కు యమా డిమాండ్!

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను చదలవాడ రూ.24 కోట్లకు కొనుక్కోగా.. దానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చి రూ.28 కోట్లతో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజుకు 5 నుంచి 10 కోట్ల ఆఫర్‌తో లాభాలు వస్తాయని ఫిలింనగర్ సమాచారం. నైజాం, వైజాగ్ మనహా మిగతా … Read more

    షూటింగ్ స్పాట్‌లో బ్యాట్ పట్టిన త్రివిక్రమ్

    [VIDEO:](url) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 మూవీ షూటింగ్ స్పాట్‌లో కాసేపు క్రికెట్ ఆడుతూ సేదతీరారు. యూనిట్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB28 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లెటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. Trivikram Garu Playing Cricket at … Read more

    ఉత్కంఠగా ‘వేద’ ట్రైలర్; శివరాజ్ 125వ మూవీ

    కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శివరాజ్ తన నటనతో అదరగొట్టాడు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు హర్ష దర్శకత్వం వహించాడు. శివరాజ్‌కు ఇది 125వ సినిమా. గీతా పిక్చర్స్ పేరుతో ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడలో సూపర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో కూడా త్వరలో విడుదల చేయనున్నారు.

    ‘నాని30’ పూజలో మెగాస్టార్ చిరంజీవి

    [VIDEO:](url)నాని 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్‌ని డైరెక్టర్‌కి అందించగా చిరంజీవి క్లాప్ కొట్టారు. నాని సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోంది. డైరెక్టర్ శౌర్యవ్‌తో పాటు నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, నాని నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న విడుదల కానుంది. Chusara! Mana cinema ni … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట విడుదల

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. దర్శనా అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కిరణ్ సరసన కశ్మీరా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా అలరిస్తుండటంతో సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకంతో ఉంది.

    నాని దసరా టీజర్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా టీజర్ విడుదలయ్యింది. వివిధ భాషల్లో హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్‌, రక్షిత్ శెట్టి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన నాని మాస్‌ లుక్ ఆకట్టుకుంది. టీజర్‌లో మందుబాటిళ్లను నాని నడుముకు కట్టుకొని వస్తుండటం వంటి అంశాలు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాను మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    భూతద్దం భాస్కర్‌ నారాయణ టీజర్

    విభిన్నమైన మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. అతడి నుంచి వచ్చిన తాజా చిత్రం “భూతద్ధం భాస్కర్‌ నారాయణ” టీజర్ విడుదలైంది. రాశిసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. డ్రీమ్స్‌ క్రియేషన్స్‌,విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివ కందుకూరి డిటెక్టీవ్‌గా కనిపించనున్నాడు. మార్చి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘బుట్టబొమ్మ’ ట్రైలర్ విడుదల

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘బుట్టబొమ్మ’. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ విడుదల చేశాడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా సాగుతున్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్ దాస్ పాత్రపై ఆసక్తికరంగా చూపించారు. చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేయగా గోపీసుందర్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానుంది.

    రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్‌ గ్లింప్స్‌

    మాస్‌ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.