• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్‌

    సమంత నటించిన శాకుంతలం నుంచి సెకండ్‌ సింగిల్ వచ్చేసింది. రుషి వనంలోన స్వర్గధామం అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిద్ధ్‌ శ్రీరామ్, చిన్మయి కలిపి ఆలపించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

    ‘భోళా’ ట్రైలర్‌ విడుదల

    తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌గా వస్తున్న హిందీ సినిమా ‘భోళా’. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన ఖైదీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ఇందులో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ సందడి చేయబోతున్నారు. అయితే ఇప్పటికే కొందరు తెలుగు ఫ్యాన్స్‌ మాత్రం ఈ ట్రైలర్‌ను చూసి… కార్తీ ఖైదీని బాలయ్య అఖండ సినిమాను కలిపి భోళాగా తీశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

    సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ ట్రైలర్‌

    సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా ‘మైఖేల్‌’ ట్రైలర్‌ విడుదలైంది. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక పాత్ర పోషించిన ఈ సినిమాకు రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు.

    తెలంగాణ నేపథ్యంలో బాలయ్య సినిమా

    బాలయ్యతో డైరెక్టర్ అనిల్ రావిపూడి తీయబోయే సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరసింహారెడ్డి రాయలసీమలో దిగితే.. వచ్చే సినిమాలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేగాకుండా తెలంగాణ యాసలో అనిల్ రావిపూడి డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. వచ్చే సినిమాలో ఫ్లాష్ బ్యాక్, తండ్రీకుమార్తెల మధ్య ఎమోషనల్ డ్రామా ఉండే అవకాశం ఉంది.

    పాట పాడిన బాలయ్య

    నందమూరి బాలకృష్ణ మరోసారి తన గాత్రానికి పని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో పాట పాడారు. మాతో పెట్టుకోకు అనే సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను ఆలపించారు. బాలయ్య స్టేజీపై పాట పాడటంతో ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్లలో రికార్డుల మోత మోగించారు. చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    రియల్‌ లైఫ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్‌

    [VIDEO](url): ‘కాంతార’ సినిమాలో క్లైమాక్స్‌ సినీ ప్రేక్షకులను ఎంతలా మైమరపించిందో..థియేటర్లలో ఎలా మార్మోగిపోయాయో చూశాం. కానీ రియల్‌ లైఫ్‌లో అలాంటి సీన్‌ ‘కాంతార’ చిత్రబృందానికి ఎదురైంది. రిషభ్‌ శెట్టి సహా చిత్రబృందమంతా తులునాడులో పంజుర్లి ఉత్సవాలకు హాజరైంది. అక్కడ భూతకోల ఆడటం, సినిమాలో మాదిరిగా రిషభ్‌ శెట్టిని దగ్గరికి తీసుకోవడం.. ఇదంతా సినిమాలో మాదిరిగానే జరిగింది. ‘కాంతార’ నిజ జీవితంలోనూ దైవానుగ్రహం పొందింది అంటూ చిత్రబృందం వీడియో షేర్‌ చేసుకుంది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the … Read more

    ‘అమిగోస్‌’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

    నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్‌’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘యెకా.. యెకా’ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

    అదిరిపోయిన సుధీర్‌ బాబు హంట్ ట్రైలర్

    యంగ్ హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న హంట్ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. భరత్ నివాస్, శ్రీకాంత్ మేక కీలక పాత్రలు పోషించారు. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఏ కేసునైతే ఆ అర్జున్ మెుదలుపెట్టి పరిష్కరించలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ పరిష్కరించాలంటూ శ్రీకాంత్ వాయిస్ ఓవర్ ఇవ్వటం ఆసక్తిని పెంచుతోంది. సినిమాను భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ వారం(January 20) విడుదలవుతున్న తెలుగు చిత్రాలు, ఓటీటీ విడుదలలు 

    సంక్రాంతికి విడుదలైన సినిమాల మేనియా ఈ వారం కూడా కొనసాగుతోంది. పండుగకి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. అయితే, ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ, ఓ సినిమా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విద్యవాసుల అహం- జనవరి 20 రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘విద్యవాసుల అహం’. మనికాంత్ దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన … Read more

    విరుచుకుపడిన వంశీ పైడిపల్లి

    [VIDEO](url): ‘వారిసు’ సినిమాను సీరియల్‌తో పోలుస్తూ వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి తీవ్రంగా స్పందించారు. ‘ నేనొక కమర్షియల్‌ సినిమాను తీశాను బ్రదర్‌. అయినా సీరియల్స్‌ను ఎందుకు తక్కువ చేస్తున్నారు. అది కూడా క్రియేటివ్‌ జాబ్‌. రోజూ ఎంతమంది సీరియల్స్‌ చూస్తారో సాయత్రం ఇంటికి వెళ్లి చూడండి తెలుస్తుంది. ఒకరిని కిందికి లాగాలని చూస్తున్నావంటే..నువ్‌ కిందనే ఉన్నావని అర్థం’ అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. "படம் எடுக்குறது ஒண்ணும் ஜோக் கிடையாது!" – விமர்சனங்களுக்கு இயக்குநர் … Read more