[VIDEO](url): ‘కాంతార’ సినిమాలో క్లైమాక్స్ సినీ ప్రేక్షకులను ఎంతలా మైమరపించిందో..థియేటర్లలో ఎలా మార్మోగిపోయాయో చూశాం. కానీ రియల్ లైఫ్‌లో అలాంటి సీన్ ‘కాంతార’ చిత్రబృందానికి ఎదురైంది. రిషభ్ శెట్టి సహా చిత్రబృందమంతా తులునాడులో పంజుర్లి ఉత్సవాలకు హాజరైంది. అక్కడ భూతకోల ఆడటం, సినిమాలో మాదిరిగా రిషభ్ శెట్టిని దగ్గరికి తీసుకోవడం.. ఇదంతా సినిమాలో మాదిరిగానే జరిగింది. ‘కాంతార’ నిజ జీవితంలోనూ దైవానుగ్రహం పొందింది అంటూ చిత్రబృందం వీడియో షేర్ చేసుకుంది.