• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తికరంగా ‘అహింస’ ట్రైలర్

    టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే పల్లెటూరి నేపథ్యంలో రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో అభిరామ్ సరసన గీతికా తివారి నటిస్తోంది. సదా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

    ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    [VIDEO:](url) బాలయ్య వీరసింహా రెడ్డి విడుదలైన థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ వద్ద దీపావళిని మించి టపాసులు కాల్చారు. డప్పు, దరువులతో కోలాహలం నెలకొంది.ఈ థియేటర్‌కి నటసింహం బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని వచ్చారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు. వీరసింహా రెడ్డి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరు 30 లక్షలు, వరంగల్‌ 17.58 లక్షలు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. https://twitter.com/i/status/1613434441556439041

    వీరసింహారెడ్డి మూవీ ట్విట్టర్ రివ్యూ

    నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అమెరికాలో ఇప్పటికే ప్రిమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘కథలో కొత్తదనం లేదు. పాత కథను కొత్తగా హ్యాండిల్ చేశారు. మొదటి 15 నిమిషాలు అవసరం లేదు. బాలయ్య వన్‌మ్యాన్ షో చేశారు.బాలయ్య డైలాగ్స్, తమన్ BGM, యాక్షన్ సీన్లు సినిమాకు బలం. మితిమీరిన ఫైట్లు కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఫస్టాప్ బాగుంది. సెకాండాఫ్ కొంచెం స్లో. వరలక్ష్మి సిస్టర్ సెంటిమెంట్, శరత్‌కుమార్, విలన్ దునియా విజయ్ … Read more

    ఆకట్టుకుంటున్న ‘గాంధీ గాడ్సే’ ట్రైలర్

    షారూక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమాకు పోటీగా నిలిచి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘గాంధీ.. గాడ్సే.. ఏక్ యుద్ధ్’. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌‌ కూడా ఆలోచింపజేస్తోంది. గాంధీని గాడ్సే తుపాకితో కాల్చి జైలుకు వెళ్తాడు. అయితే, గాంధీని బతికితే ఎలా ఉంటుంది? ఎలా ఉండేది? అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ నెట్టింట … Read more

    ఫిబ్రవరి 10న టైటానిక్ రీరిలీజ్

    జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఎపిక్ చిత్రం ‘టైటానిక్’ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 10న సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పారామౌంట్ పిక్చర్స్ రీ రిలీజ్ ట్రైలర్‌ని ట్విటర్‌లో షేర్ చేసింది. మాస్టర్‌ వెర్షన్‌ 3డీ సహా.. 4కెలో విడుదల చేస్తుండటం విశేషం. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించడమే కాక.. వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులనూ … Read more

    వాల్తేరు వీరయ్య ‘నీకేమో అందమెక్కువ’ లిరికల్‌

    చిరంజీవి, శ్రుతి హసన్ ప్రధాన పాత్రల్లో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా మరో లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘నీకేమో అందమెక్కువ..నాకేమో తొందరెక్కువ’ అంటూ సాగిన ఈ పాటలో బాస్‌ మరోసారి తన గ్రేస్‌ చూపించారు.

    USలో బాలయ్య అభిమానుల రచ్చ

    [VIDEO](url):సంక్రాంతి బరిలో మాస్‌ జాతర మొదలైంది. బాలయ్య ‘వీర సింహారెడ్డి’ రేపు థియేటర్లలో రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్‌లో సందడి మొదలైంది. నందమూరి అభిమానులు అమెరికా వీధుల్లో కార్లతో సందడి చేస్తున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లో కార్లతో NBK అంటూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని సినిమా దర్శకుడు గోపిీచంద్ మలినేని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. NBK’S #veerasimhareddy ?mania in Kansas City., USA on SUNDAY pic.twitter.com/fo4DpgiXJi — Gopichandh Malineni (@megopichand) January 11, 2023

    ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఐదో సాంగ్ లాంఛ్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ నుంచి మరో సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ బాబీ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది.

    సిక్స్‌ప్యాక్‌తో ‘గూఢచారి-2’; అడివి శేష్

    తను హీరోగా నటించబోయే[ ‘గూఢచారి-2’ ](url)మూవీలో సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తానని యంగ్ హీరో అడివి శేష్ తెలిపాడు. హైదరాబాద్‌లో జరిగిన ప్రి విజన్ ఈవెంట్‌లో శేష్ మాట్లాడాడు. ‘‘జీ2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నాం. ఈ చిత్రాన్ని 5 దేశాల్లో షూట్ చేస్తాం. ఇండియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చిత్రీకరణ చేయనున్నాం. మేజర్ సినిమా ఎడిటర్ వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఆయన కోరుకున్న విధంగా లుక్ వచ్చినప్పుడే షూటింగ్ వెళ్తాం.’’ అంటూ చెప్పుకొచ్చాడు. Here is the … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌

    యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ నుంచి టీజర్‌ విడుదలయ్యింది. లవ్‌, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయంటూ చెప్పి, అసలు కాన్సెప్ట్‌ చెప్పకుండా టీజర్‌ను సిద్ధం చేశారు. టీజర్ కట్ చాలా కొత్తగా ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌ మరింత మెరుగుపడింది. సినిమాలో కశ్మీరా హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, అమల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.