నందమూరి బాలకృష్ణ మరోసారి తన గాత్రానికి పని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో పాట పాడారు. మాతో పెట్టుకోకు అనే సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను ఆలపించారు. బాలయ్య స్టేజీపై పాట పాడటంతో ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్లలో రికార్డుల మోత మోగించారు. చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.