• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోన్న ‘మ్యాడ్’

    యువ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.10.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. యూఎస్‌లో ఈ చిత్రం రూ.2.5 లక్షల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మేకర్స్ అంచనాలకు మించి విజయం సాధించడంతో మూవీ టీం సంబరాలు చేసుకుంటోంది. గౌరీప్రియ, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించాడు.

    మా బావకి ‘మ్యాడ్’ బాగా నచ్చింది: నార్నే నితిన్

    ‘మ్యాడ్’ మూవీ చాలా బాగుందని తన బావ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారని యంగ్ హీరో నార్నే నితిన్ అన్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. టీం మొత్తం కష్టపడి పనిచేయడంతోనే ఈ విజయం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియారెడ్డి, అనంతిక, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    రష్మిక మంధాన లిప్ లాక్ చేసిన రణబీర్

    యానిమాల్ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే ఈ సాంగ్‌లో రణబీర్, రష్మికల మధ్య ఘాటైన రోమాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో లిప్‌ లాక్ సీన్ ఉండటంతో సాంగ్ ఈవిధంగా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలో విడుదలకానుంది.

    ‘ఇండియన్-2’పై క్రేజీ అప్డేట్

    విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ డబ్బింగ్ చెబుతున్న ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. దీంతో మూవీ షూటింగ్ డబ్బింగ్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!

    టాలీవుడ్‌లో వచ్చే వారం పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో చిన్న చితకా సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 20కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం థియేటర్లలలో విడుదలకు సిద్ధమైన సినిమాలు గాఢ్ తమిళ్‌లో హిట్ సాధించిన ఇరైవన్ మూవీ తెలుగులో గాఢ్ పేరుతో అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, జయం రవి ప్రధాన … Read more

    మహేశ్‌ ‘గుంటూరు కారం’పై ఆసక్తికర చర్చ

    సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ సీన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ మొత్తం ఈ సీన్ చుట్టూనే తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

    ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

    నిన్న విడుదలైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.

    డాడి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అనిండు: బాలకృష్ణ

    భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ క్రేజీ కామెంట్స్ చేశారు. “హీరోయిన్ శ్రీలీల చిచా, చిచా అని సినిమాలో టార్చర్ పెట్టింది. నాతో సినిమాలో నటించావ్ సరే. వచ్చే సినిమాలో ఇద్దరం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పా. ఇదే విషయం మా ఇంట్లో చెబితే.. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడి నెక్ట్స్‌ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తున్నావ్. ఏం డాడి నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అనిండు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. … Read more

    టెలివిజన్‌లోకి రాబోతున్న ‘బ్రో’

    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా టెలివిజన్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్‌ 15 సా. 6:00 గంటలకి జీ తెలుగులో ప్రసారం కానుంది. జులై 28న విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ కీలక పాత్రలు పోషించారు. థమన్‌ అద్భుతమైన సంగీతం అందించారు. కాగా, బుల్లితెరపై ఈ సినిమా ఏ మేర ఆదరణ సంపాదిస్తుందో చూడాలి.

    చిరు 157వ చిత్రం రిలీజ్‌ అప్పుడే!

    చిరంజీవి తన 157వ చిత్రాన్ని దర్శకుడు విశిష్టతో చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తిచేయాలని చిత్రం యూనిట్‌ భావిస్తోందట. ఆ తర్వాతి ఆరు నెలలు VFX పనులపై ఫోకస్‌ పెట్టాలని యోచిస్తున్నారట. మెుత్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2025 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. Courtesy Twitter: Courtesy Twitter: