• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జవాన్’ మూవీ భారీ వసూళ్లు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ఇప్పటికే రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే రూ.1.70 కోట్లు రాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, దీపికా పదుకొనే గెస్ట్ రోల్స్ చేశారు.

    ఎన్టీఆర్‌పై యంగ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై యువ దర్శకుడు నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుందని, అన్నతో ఐరన్ మ్యాన్ వంటి ఓ సూపర్ హిట్ మూవీ తీయాలని ఉందని చెప్పారు. భవిష్యత్తులో కచ్చితంగా ఎన్టీఆర్‌తో అలాంటి సినిమా తీస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘దేవర’తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నారు. అయితే దాని తర్వాత నాగవంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఓ మూవీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

    సంజ్ఞా భాషలోనూ ‘టైగర్ నాగేశ్వరరావు’

    ఈ నెల 19న విడుదలై దసరా బరిలో నిలవనున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని సంజ్ఞా భాషలో ( సైన్ లాంగ్వేజ్) సైతం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ భాషలో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదేనని, మూవీని ఎక్కువ మందికి దగ్గర చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రవితేజ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ మూవీకి వంశీ దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు.

    వరంగల్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్

    భగవంత్ కేసరి ట్రైలర్ లాంచింగ్ వేదిక ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హీరో బాలకృష్ణ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 8న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. తండ్రి కూతుళ్ల అనుబంధమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావుపూడి తెరకెక్కిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది.

    మెలోడియస్‌గా… గాజు బొమ్మ సాంగ్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపేలా సాంగ్ సాగింది. ‘గాజు బొమ్మ’ సాంగ్ కంపోజింగ్ మెలోడియాస్‌గా ఉంది. కాగా ఈ సినిమాను డిఫరెంట్ స్టోరీతో శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

    ఎస్తర్ ప్రధాన పాత్రలో ‘లేతాకులు’

    ఎస్తర్ ప్రధాన పాత్రలో రూపొందనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘లేతాకులు’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి చంటి జ్ఞానమణి దర్శకత్వం వహిస్తుండగా ఎంఆర్ చౌదరి సమర్పణలో ఫ్రెష్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకటేశ్ చిక్కాల నిర్మిస్తున్నారు. శృతిశరణ్, అవయుక్త, వంశీ పాండ్య నటిస్తున్నారు. ఎస్తర్ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందని, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కొన్ని సీన్స్‌ ఉత్తరప్రదేశ్‌లో తీయనున్నట్లు తెలిపారు.

    రూల్స్ రంజన్ ట్విట్టర్‌ రివ్యూ

    కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో వచ్చిన రూల్స్ రంజన్ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంది. లుక్స్, యాక్టింగ్ ఓకే. నేహశెట్టితో రొమాన్స్ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ కామెడీ లైనప్‌తో బాగుండి. సెకండాఫ్ పర్వాలేదు. సినిమాలో పాటలు బాగున్నాయి. సమ్మోహనుడా సాంగ్ థియేటర్లలో కేకలు పుట్టించింది అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

    800 Movie Review: కంటతడి పెట్టించిన మురళీధరన్‌ జీవిత కథ.. సినిమా ఎలా ఉందంటే?

    న‌టీన‌టులు: మధుర్ మిత్తల్‌, మహిమా నంబియార్, నరేన్, వేల తదితరులు రచన, దర్శకత్వం: ఎం.ఎస్ శ్రీపతి సంగీతం: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్ నిర్మాత: వివేక్ రంగాచారి బ్యానర్: మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్‌ శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (Muttiah Muralitharan) జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. టెస్ట్ మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెట‌ర్ మురళీధరన్‌. అందుకే సినిమాకు ‘800’ టైటిల్‌ను పెట్టారు. శ్రీలంక‌ తమిళ కుటుంబానికి చెందిన ముత్త‌య్య ఎన్నో స‌వాళ్ల‌ని ఎదుర్కొంటూ ఆ దేశ … Read more

    ‘హాయ్ నాన్న’ నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. గాజు బొమ్మ.. నేనే నాన్న అంటూ సాంగ్ సాగింది. గాజు బొమ్మ పూర్తి పాటను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈచిత్రానికి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు. శౌర్యూవ్ డైరెక్ట్ చేశాడు. https://x.com/NameisNani/status/1709823205052133545?s=20

    ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వసూళ్ల వర్షం

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైనప్పటికీ యూఎస్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ లేటెస్ట్‌గా 1.825 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. ఈ మూవీని దర్శకుడు మహేశ్‌బాబు తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.