• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్, సాయిధరమ్ సినిమా పేరు BRO !

    పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన వినోదయ సిత్తమ్ రీమేక్‌ టైటిల్‌ గురించి క్రేజీ టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి BRO అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌స్టార్‌ను సాయిధరమ్ ఎక్కువగా బ్రో అని పిలుస్తుంటాడట. అందుకే దర్శకుడు సముద్రఖని వినూత్నంగా ఆలోచించి అదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని భావించాడు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈ క్రేజీ టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. It's super #Bro ?#PKSDT pic.twitter.com/eVreQskdr9 … Read more

    ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి

    విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ మెలోడి అదిరిపోయింది. అబ్ధుల్ వహాబ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సినిమాకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ పాటను రాశాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది.

    POLICE MOVIES: పోలీస్ యూనిఫామ్‌పై హీరోల మోజు.. పెరుగుతున్న సినిమాల హవా

    టాలీవుడ్‌లో పోలీసు సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు. అందుకే కథానాయకులు సైతం పోలీస పాత్రలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోలీసు ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో కథానాయకులు మళ్లీ పోలీసు కథలపై తమ దృష్టి కేంద్రీకరించారు. ఖాకీ దుస్తుల్లో కనిపించి తమ అభిమానులను అలరిస్తున్నాారు. అటు డైరెక్టర్లు సైతం పోలీసు స్టోరీలను సిద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం. 1. … Read more

    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ … Read more

    సునీల్‌ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌ వీడియో

    టాలీవుడ్ నటుడు సునీల్ ప్రధాన పాత్రలో నటించిన భువన విజయమ్‌ సినిమా నుంచి మరో ప్రమోషనల్‌ వీడియో విడుదలైంది. ‘సోల్‌ ఆఫ్ భువన విజయమ్‌’ పేరుతో ఈ వీడియోను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. యలమంద చరణ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.

    ఆసక్తిగా ‘కస్టడీ’ ట్రైలర్

    యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో చైతూ పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మూవీని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమాలో అరవిందస్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    రామబాణం ట్విట్టర్ రివ్యూ

    ఈరోజు విడుదలైన రామబాణం ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఫ్యామిలి సెంటిమెంట్‌తో కథ ఉంది. ఎక్కడ బోర్ కొట్టదని చెబుతున్నారు. గోపిచంద్ జగపతి బాబు మధ్య సెంటిమెంట్ బాగా తీశారు. గోపిచంద్ కామెడీ టైమింగ్, ఫైట్స్ బాగున్నాయి. డింపుల్ హయతి సాంప్రదాయబద్దంగా ఉంది. రోటిన్ స్టోరీ, సాంగ్స్ అంత మెప్పించవు. కొన్ని సీన్లు ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్. పూర్తి రివ్యూ మరికాసేపట్లో.. #Ramabanam – Public Talk ?? Yt link – https://t.co/8oynoQA1C7#RamabanamReview #Gopichand … Read more

    అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ ట్విట్టర్ రివ్యూ

    అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ కామెంట్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. దసరా మూవీ తర్వాత అదే రేంజ్‌లో ఉగ్రం ఉంది. అల్లరి నరేష్ యాక్టింగ్ సూపర్బ్, BGM, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. లవ్ సీన్స్, కొన్ని చోట్ల సాగదీయడం సినిమాకు మైనస్. క్లైమాక్స్‌ ఇంకొంచెం బాగా తీసి ఉండాల్సింది అని కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా మూవీపై పాజిటివ్ టాక్‌ వినిపిస్తోంది. పూర్తి రివ్యూ కాసేపట్లో.. #Ugram movie review … Read more

    ‘జైలర్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఎప్పుడంటే?

    తమిళ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్‌’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ఓ వీడియో రూపంలో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో తలైవా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. మోహన్‌లాల్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. It's official now?Superstar #Rajinikanth's #Jailer to hit the screens … Read more

    టీజర్ బాగా నచ్చింది: రామ్‌ చరణ్

    యంగ్ హీరోయిన్ నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. టీజర్ చాలా బాగుందని తాను ఎంజాయ్ చేసినట్లు, మైండ్‌కు చాలా రీప్రెషింగ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్‌ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.